బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయం: సీఎం కేసీఆర్

CM KCR Commemorated Teachings of Gautama Buddha On the Occasion of Gautam Buddha Jayanti, KCR Commemorated Teachings of Gautama Buddha On the Occasion of Gautam Buddha Jayanti, Telangana CM KCR Commemorated Teachings of Gautama Buddha On the Occasion of Gautam Buddha Jayanti, K Chandrashekar Rao Commemorated Teachings of Gautama Buddha On the Occasion of Gautam Buddha Jayanti, Teachings of Gautama Buddha On the Occasion of Gautam Buddha Jayanti, Commemorated Teachings of Gautama Buddha, Gautam Buddha Teachings, Gautama Buddha, Buddha Purnima, Gautam Buddha Jayanti, Gautam Buddha Jayanti News, Gautam Buddha Jayanti Latest News, Gautam Buddha Jayanti Latest Updates, Gautam Buddha Jayanti Updates, CM KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని సీఎం అన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని, కృష్ణా నది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ‘బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదన్నారు. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =