కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచింది : సీఎం కేసీఆర్

CM KCR Greeted Telangana People, CM KCR Greeted Telangana People on the Occasion of Telangana Language Day, CM KCR greets people on Telangana Language Day, Mango News, telangana, Telangana CM KCR, Telangana CM KCR greets people, Telangana Language Day, Telangana Language Day 2021, Telangana Language Day Greetings, Telangana Language Day Greetings by CM KCR, Telangana Language Day Wishes

ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని, వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న కవులు, రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదని సీఎం గుర్తు చేశారు. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అని నినదించిన కాళోజీ జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కాళోజీ పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గానూ ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామకృష్ణ అందుకోనున్నారు. ఈ సందర్భంగా పెన్నా శివరామకృష్ణకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ