తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కాంగ్రెస్ తమవైపు లాక్కుంటోంది. బీఆర్ఎస్‌ను లూటీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యత సన్నిహితుడైన పోచారం శ్రీనివాస రెడ్డి కూడా కారు దిగి.. హస్తం గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో పోచారం తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి.. హస్తం పార్టీలో చేరారు.
జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదివారం రాత్రి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి.. సంజయ్ కమార్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కేసీఆర్ కుమార్తె కవితక డాక్టర్ సంజయ్ అత్యంత సన్నిహితుడు. అసలు సంజయ్ పార్టీ వీడుతారని ఎవరూ కూడా ఊహించి ఉండరు. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే సంజయ్ కుమార్ 2014లో బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున జగిత్యాల నుంచి పోటీ చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018లో మరోసారి కేసీఆర్ సంజయ్‌కే అవకాశం ఇచ్చారు. మరోసారి జీవన్ రెడ్డి, సంజయ్ పోటీ పడ్డారు. ఈ పోటీలో సంజయ్ గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సంజయ్ జగిత్యాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ సంజయ్‌కు టికెట్ ఇచ్చింది. అందులో రెండుసార్లు ఆయన గెలుపొందారు.
అయితే రెండోసారి ఆయన గెలుపొందినప్పటికీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సంజయ్ నిరుత్సాహంతో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి కీలక నేతగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు కూడా తెలియకుండా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారట. ప్రస్తుతం ఈ అంశం జగిత్యాలలో కాక రేపుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY