జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

Jubilee Hills Bypoll CM Revanth Reddy to Hold Campaign With Rallies, Roadshows

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మక పోరాటంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించే బాధ్యతను ఆయనే స్వయంగా భుజాన వేసుకున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనకు కొలమానంగా మారడంతో పాటు, భవిష్యత్తులో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్:

రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలోకి స్వయంగా దిగుతున్నారు. ఈ నెల 28న యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న అభినందన సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ సభలో ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావునూ సన్మానించనున్నారు.

ఈ అభినందన సభతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30, 31 తేదీల్లోను, అలాగే నవంబర్ 4, 5 తేదీల్లోను నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇక ఈ ప్రచార కార్యక్రమాల మధ్యలో ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలో పాల్గొననుండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here