గణేష్ ఉత్సవాలంటేనే అందరికి ఆశక్తి కలిగించే అంశం లడ్డూ వేలం. ఈ సారి లడ్డూ ప్రసాదం ఏకంగా రూ.1.87 కోట్ల ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో ఈ రికార్డు క్రియోట్ అయింది. దీంతో గణేశుడి లడ్డూ ధర రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. కాగా గతేడాది ఇక్కడి లడ్డూ రూ.1.20 కోట్లు పలికిన విషయం తెలిసిందే. పోయిన సంవత్సరం లడ్డూ ధర ఏకంగా రూ.67 లక్షల మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఉంది కీర్తి రిచ్‌మండ్ విల్లా. అక్కడ ఏటా భారీ ధరకు లడ్డూ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా ధనవంతులు కావడంతో లడ్డూ వేలం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గనట్టుగా వేలం పాట జరిగింది. రికార్డు ధరకు లడ్డూను పాడుకున్నారు భక్తులు. కీర్తి రిచ్‌మండ్ విల్లాలో నిర్వహించిన లడ్డూ వేలంలో కమ్యూనిటీ మొత్తం పాల్గొంది. గణపతి లడ్డూను కోటీ 87 లక్షలకు సొంతం చేసుకుంది. గతంలో కూడా ఇక్కడ రికార్డు స్థాయిలో లడ్డూ అమ్ముడు పోయింది. గతేడాది కోటీ 26 లక్షలకు ఇక్కడ లడ్డు వేలంలో అమ్మడుుపోయింది. ఈసారి కూడా అంతకు మించి అన్నట్టు భక్తులు భారీ ధర పెట్టి లడ్డూను పాడుకున్నారు. ఇప్పుడు ఇదే అందరిలో చర్చనీయాంశంగా మారింది.
ఈ మధ్య హైటెక్ సిటీలో ఉన్న మైహోం భూజాలో లడ్డూ వేలం వేస్తే అక్కడ కూడా రికార్డు స్థాయి ధరకు గణేష్ లడ్డూ అమ్ముడు పోయింది. 29 లక్షల రూపాయలకు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి లడ్డూను కొనుగోలు చేశారు. ఆదివారం చేపట్టిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేశ్ 29 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఇక్కడ లడ్డూ 25.50 లక్షలు పలికింది.
చూపంతా బాలాపూర్ గణేశ్ లడ్డూపైనే..
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఎంత ధర పలకనుందనేది ఆసక్తికరంగా మారింది. భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఒక ఆనవాయితీ కొనసాగుతోంది. ఒకసారి బాలాపూర్ గ్రామ ప్రజలకు, ఒకసారి ఇతరులకు లడ్డూను వేలంలో ఇస్తున్నారు. గత సంవత్సరం బయట వ్యక్తి అయిన దయానంద రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మరి ఈసారి బాలాపూర్ లడ్డూ ఎవరు కైవసం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.