మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నేటితో (అక్టోబర్14, శుక్రవారం) నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ముందుగా మునుగోడు ఉపఎన్నికకు అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుండి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 13, గురువారం వరకు మునుగోడు ఉపఎన్నికకై 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 15న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 17గా ప్రకటించారు. అలాగే నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 6న కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అక్టోబర్ 10న, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్టోబర్ 13న నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నేడు చండూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు నామినేషన్ల ఘట్టం కూడా పూర్తికావడంతో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల కీలక నేతలంతా మునుగోడులో మోహరించి గ్రామాల వారీగా ప్రజలను కలుసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY