ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం, నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ నామినేషన్

Oscars 2023 Nominations: Naatu Naatu Song from RRR Movie has been Nominated for Best Original Song,Oscars 2023,RRR Film Sensation,Natu Natu Song Oscar Nomination,Mango News,Mango News Telugu,Jr Ntr,Akshay Kumar,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates,RRR Songs,RRR Video,Naatu Naatu Song Lyrics,Natu Natu Song,Rahul Sipligunj Naatu Naatu,RRR Natu Natu Song,RRR Natthu Nattu Song,RRR Natu Natu Song Singer Name,RRR Natu Natu Song Choreographer Name,RRR Natu Natu Video Song,RRR Natu Natu Video Song Download,RRR Natu Natu Song Dance Master,RRR Natu Natu Song Lyrics In Telugu,RRR Movie Natthu Nattu Song,RRR Songs Tamil Nattu Nattu

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 95వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్ వెలువడ్డాయి. కాలిఫోర్నియా వేదికగా జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యాతలు రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ 95వ ఆస్కార్ నామినేషన్లను (2023)ను ప్రకటించారు. వివిధ కేటగిరీల్లో 95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ తరుపున వెల్లడించారు. కాగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్-2023’ అవార్డుల నామినేషన్ల జాబితాలో ఓ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి సంచలనం సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, లిరిక్స్: చంద్రబోస్, గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ ) ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ చేయబడింది.

అలాగే ఈసారి ఆస్కార్ 2023 నామినేషన్స్ లో ఇండియా నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటుతో పాటుగా, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కింద షౌనక్ సేన్ ‘ఆల్ దట్ బ్రీత్’ మరియు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరి కింద ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఎంపికయ్యాయి.

ఒరిజినల్ సాంగ్ విభాగంలో టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ చిత్రం నుండి ‘అప్లాజ్’, టాప్ గన్:మావెరిక్ చిత్రం నుండి ‘హోల్డ్ మై హ్యాండ్’, బ్లాక్ పాంథర్:వకాండ ఫరెవర్ చిత్రం నుండి ‘లిఫ్ట్ మి అప్’ మరియు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ చిత్రం నుండి ‘దిస్ ఈజ్ ఎ లైఫ్’ సాంగ్స్ తో నాటు నాటు సాంగ్ పోటీ పడుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం 23 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతీయ చిత్రమైన ఆర్‌ఆర్‌ఆర్ కు నామినేషన్ లభించింది. మరోవైపు నాటు నాటు సాంగ్ ఇటీవలే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్స్’ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా సాంగ్ గా నాటు నాటు నిలిచింది.

95వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 23 కేటగిరీల్లో నామినేషన్లను ప్రకటించగా, మార్చి 12న ఆస్కార్ వేడుకలు నిర్వహించి అవార్డులు ప్రధానం చేయనున్నారు. గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచగా, బ్రిటిష్ చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని “జై హో” సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ మరియు ఒరిజినల్ సాంగ్ విభాగాలలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి హిందీ పాటగా నిలిచింది. తాజాగా భారతీయ చిత్రమైన ఆర్‌ఆర్‌ఆర్ లోని నాటు నాటు సాంగ్ నామినేషన్ దక్కించుకోగా, మార్చి 12న ఆస్కార్ అవార్డ్ సాధిస్తే సరికొత్త రికార్డ్ తో, చరిత్ర సృష్టించనుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడంతో దర్శకుడు రాజమౌళికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి దేశంలోని పలువురు సినీ, రాజకీయ, పలు రంగాల ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =