2024లో కేంద్రంలో మ‌న‌కు అనుకూలంగా ఉండే ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందాం – మంత్రి కేటీఆర్

Minister KTR Calls Telangana People For Support of CM KCR's BRS Party in Next Elections,Lets Get A Government In 2024,Favorable To Us At The Center,Minister Ktr,Brs Leader,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

2024లో కేంద్రంలో మ‌న‌కు అనుకూలంగా ఉండే ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు మంగళవారం ఆయన నారాయ‌ణ‌పేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. అంతకుముందు రాష్ట్రమంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నారాయణపేటలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించారు. దీనితో పాటుగా కొత్తగా నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి కేటీఆర్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసేందుకు తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలని, దీనికోసం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమవద్ద కూడా అమలుచేయాలని పక్క రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారంటే.. సీఎం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్ధమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రంలోని కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని, ఈ తరహా పాలన కేంద్రంలో కూడా రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని, రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ సహా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా తేల్చాల‌ని, న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలు మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌లో జ‌రుగుతున్నాయ‌ని, తెలంగాణ ప్ర‌భుత్వం కోరుతున్న విధంగానే 500 టీఎంసీల కేటాయించాల‌ని ఈ స‌మావేశాల్లో తీర్మానం చేయాల‌ని కోరారు. అలాగే పాలూమ‌రు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జాతీయో హోదా ఇవ్వాల‌ని ప్రధాని మోదీకి చెప్పాలని, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా మీద ప్రేమ ఉంటే రాష్ట్ర బీజేపీ నాయకులు వెంటనే ఈ డిమాండ్లపై తీర్మానం చేయాలని సూచించారు. తమకు పనులు చేస్తోందెవరో.. మాటలు చెప్పి మభ్య పెడుతోందెవరో ప్రజలు గమనించాలని, విజనతతో వ్యవహరించి వచ్చే ఎన్నికల్లో సమర్ధుడైన కేసీఆర్ పార్టీకి మద్దతివ్వాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =