ఆర్‌ఆర్‌ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ కు ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్స్’ అవార్డు, చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు హర్షం

RRR's Naatu Naatu Song Wins Golden Globes 2023 Award for Best Original Song Chiranjeevi AR Rahman Congratulates RRR Team,Chiranjeevi Congratulates RRR Team,AR Rahman Congratulates RRR Team,RRR's Naatu Naatu Song Wins Golden Globes 2023,Golden Globes 2023,Mango News,Mango News Telugu,Best Original Song Naatu Naatu Song,Music Director Keeravani,Keeravani Receives Golden Globe Award,RRR Wins Golden Globe Award,Best Original Song Category,Best Original Song Naatu Naatu,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించి, పలు విభాగాల్లో అంతర్జాతీయ అవార్డులు సాధించి సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు తాజాగా మరో అత్యున్నత పురస్కారం లభించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్స్’ అవార్డును ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కైవసం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా సాంగ్ గా నాటు నాటు నిలిచింది

‘గోల్డెన్ గ్లోబ్స్-2023’ అవార్డులలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్-మోషన్ పిక్చర్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. ఈ విభాగంలో వేర్ ది క్రాడాడ్స్ సింగ్ చిత్రం నుండి ‘కరోలినా’, గిల్లెర్మో డెల్ టోరో పినోచియో నుండి ‘సియావో పాపా’, టాప్ గన్ మావేరీక్ నుండి ‘హోల్డ్ మై హ్యాండ్’, బ్లాక్ పాంథర్:వకాండ ఫరెవర్‌ చిత్రం నుండి “లిఫ్ట్ మి అప్” సాంగ్స్ తో నాటు నాటు సాంగ్ పోటీ పడి అవార్డు గెలుచుకుంది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌ వేదికగా బుధవారం జరిగిన గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి సహా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని సందడి చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారం దక్కడం పట్ల అగ్ర నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. “ఎంత అపూర్వమైన, చారిత్రాత్మక విజయం, నాటు నాటు సాంగ్ కు గానూ కీరవాణికి గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్-మోషన్ పిక్చర్ అవార్డు దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు నా అభినందనలు. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. నాటు నాటు అనేది సంగీతం, డ్యాన్స్ రెండింటి యొక్క సెలబ్రేషన్. దేశమే కాదు ఈ రోజు ప్రపంచం మొత్తం మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. రామ్ చరణ్‌, తారక్‌ కు అభినందనలు. అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌ కు, అద్భుతంగా ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు” అని పేర్కొన్నారు. అలాగే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, తెలుగు సహా పలు సినీ పరిశ్రమల ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ కు అభినందనలు తెలిపారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =