గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న సందేశాత్మక చిత్రాలు

Srimanthudu, Mallesam, Balagam and Other Message Oriented Movies Wins TGF Awards

సాధారణంగా సినిమాలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే చూస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ మంచి సందేశాత్మక చిత్రాలు కూడా తెరకెక్కుతుంటాయి. ప్రతిరోజూ మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను, సమస్యలను ఎత్తిచూపుతుంటాయి. తద్వారా ప్రజలను జాగృతి పరుస్తుంటాయి. ప్రేక్షకులను ఆయా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచింపజేస్తుంటాయి. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణే కాకుండా అవార్డులు సైతం లభిస్తుంటాయి.

ఇక ఇటీవలే 2014 నుండి 2024 వరకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (మొదటి ఉత్తమ, రెండవ ఉత్తమ, మూడవ ఉత్తమ) విభాగంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా జ్యూరీ, ప్రేక్షకులు మెచ్చిన కొన్ని సందేశాత్మక చిత్రాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలు ఇవే..!

  • 2014 – పాఠశాల (సెకండ్ బెస్ట్ ఫిల్మ్)
  • 2015 –  శ్రీమంతుడు (మూడో బెస్ట్ ఫిల్మ్)
  • 2019 – మహర్షి (ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్)
  • 2019 – మల్లేశం (థర్డ్ బెస్ట్ ఫిల్మ్)
  • 2023 – బలగం (ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్)