ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్

Annual Recruitment Calendar, Annual Recruitment Calendar to Fill Vacancies in Govt Posts, Cabinet to prepare annual recruitment calendar, Mango News, Telangana Annual Recruitment Calendar, Telangana Cabinet, Telangana Cabinet Announces Annual Recruitment Calendar, Telangana Cabinet Announces Annual Recruitment Calendar to Fill Vacancies in Govt Posts, Telangana cabinet announces recruitment calendar, Telangana cabinet okays annual job calendar, Telangana Cabinet to Launch Job Calender Soon, Telangana cupboard broadcasts recruitment calendar, Telangana Govt jobs

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగాల ఖాళీల భర్తీకై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్:

అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ ను తయారు చేయాలని, ఉద్యోగాల ఖాళీల భర్తీకై ‘వార్షిక నియామక క్యాలెండర్’ (జాబ్ క్యాలెండర్) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు బుధవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. బుధవారం జరిగే సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది.

మరోవైపు కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్ కు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ ఆదేశించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =