తెలంగాణలో మరో 1863 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 14, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 90,259 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 684 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.75% (< 1%) శాతంగా ఉంది.

ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1912 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 66,196 కి చేరింది. ప్రస్తుతం 23,379 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 73.34 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 394, మేడ్చల్ జిల్లాలో 175, రంగారెడ్డిలో 131, కరీంనగర్ లో 104, వరంగల్ అర్బన్‌ 101, రాజన్న సిరిసిల్లలో 90, సంగారెడ్డిలో 81, జగిత్యాలలో 61, ఖమ్మంలో 61, సిద్దిపేటలో 60, జోగులాంబ గద్వాల్ లో 58, నల్గొండలో 49, వరంగల్ రూరల్ లో 41, పెద్దపల్లిలో 40 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu