తెలంగాణలో 24 గంటల్లో 1,63,913 మందికి కరోనా వ్యాక్సిన్

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Telangana Covid-19 Vaccination Program, Telangana Covid-19 Vaccination Program Updates, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 24, శనివారం నాడు 29,736 మందికి మొదటి డోస్, 1,34,177 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,63,913 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే శనివారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,40,05,928 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1,10,68,414 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 29,37,514 మంది లబ్ధిదారులకు రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.

తెలంగాణలో జూలై 24 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 3,02,402
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 2,19,733
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 3,14,349
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) :1,80,374
  • 45 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 53,48,177
  • 45 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 20,81,220
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 51,03,486
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 4,56,187
  • మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,40,05,928
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ