రాష్ట్రంలో అనధికార ప్లాట్లు మరియు భవనాల నమోదును నిషేధిస్తూ ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ సహా రాష్ట్రంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) కు అవకాశం ఇచ్చింది. ఆగస్టు 26 లోపు డెవలప్ చేసిన లే అవుట్లు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ కు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారు. లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనధికార ప్లాట్లు, లే అవుట్లు క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకుంటామని, వాటి విక్రయాలపై నిషేధం విధించి, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని పేర్కొన్నారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ ఫీజు:
- ప్లాట్ ఓనర్స్ కు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1000
- లే అవుట్ ఓనర్స్ కు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10000
- ప్లాటు 100 గజాలలోపు ఉంటే గజానికి ఫీజు రూ.200 చెల్లించాలి
- ప్లాటు 100 నుంచి 300 గజాల వరకు ఉంటే గజానికి ఫీజు రూ.400 చెల్లించాలి.
- ప్లాటు 300 నుంచి 500 వరకు వరకు ఉంటే గజానికి ఫీజు రూ.600 చెల్లించాలి.
- 500 పైన ప్రతి గజానికి రూ.750 చెల్లించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu





































