రైతు భీమా కోసం రూ.1450 కోట్లు, చెక్కు అందజేసిన తెలంగాణ రాష్ట్రమంత్రులు

LIC Delegates, Mango News, Rs 1450 Cr Rythu Bheema Insurance Cheque to LIC Delegates, Rythu Bheema, Rythu Bheema Insurance, Rythu Bheema Insurance Cheque to LIC Delegates, Rythu Bheema Scheme, Rythu Bheema Scheme Telangana, Telangana Ministers, Telangana Ministers Handed over Rs 1450 Cr Rythu Bheema Insurance Cheque to LIC Delegates, Telangana releases Rs 1450 crore towards Rythu Bima, Telangana Rythu Bheema Scheme

2021-2022 సంవత్సరానికి గానూ రైతుభీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు చెక్కును అందజేశారు. రైతుభీమా కోసం ప్రభుత్వం రూ.1450 కోట్లను విడుదల చేసింది. ఈ చెక్కును ఎల్ఐసీ ప్రతినిధులకు అందజేసే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు తీసుకొచ్చామని, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, వందశాతం పంటల కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగం ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. సమైక్యరాష్ట్రంలో నష్టపోయిన రైతాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దికి వ్యవసాయరంగ పథకాలు నిదర్శనమని, సమైక్య పాలనలో రైతుకు కష్టం వస్తే పట్టించుకున్న నాధుడు లేడన్నారు. రూ.50 వేల ఆపద్భంధు సొమ్ము కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అరకొర మందికే అది దక్కేదన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజుల లోపు రూ.5 లక్షల చెక్కును ఇంటికి తెచ్చి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ