తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు సంక్షేమ శాఖలకు సంబంధించి 581 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, వార్డెన్ గ్రేడ్-1, వార్డెన్ గ్రేడ్-2, మ్యాట్రన్ గ్రేడ్-1, మ్యాట్రన్ గ్రేడ్-2, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు.
మొత్తం 581 పోస్టుల్లో అత్యధికంగా గ్రేడ్-1 మరియు గ్రేడ్-2 కలిపి 549 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 2023, జనవరి 6 నుండి ప్రారంభమవుతుందని మరియు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2023, జనవరి 27 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ http://www.tspsc.gov.inని సందర్శించి, నిర్దేశించిన ప్రొఫార్మాలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో పలు సంక్షేమ శాఖలకు సంబంధించి 581 పోస్టుల భర్తీ:
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 – ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – 05 పోస్టులు
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 – ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – 106
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఫీమేల్ – ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ – 70
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 మేల్ – ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ – 228
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 – బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – 140 పోస్టులు (ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ – 87, పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్-14, ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ – 26, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ – 13)
- వార్డెన్ గ్రేడ్-1 – డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ – 05
- మ్యాట్రన్ గ్రేడ్-1 – డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ – 03
- వార్డెన్ గ్రేడ్-2 – డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ – 03
- మ్యాట్రన్ గ్రేడ్-2 – డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ – 02
- లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ (ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్) – 19.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE