ఢిల్లీలో ప్రవేశించిన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’.. పాల్గొన్న సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా

Bharat Jodo Yatra Sonia Gandhi and Priyanka Vadra,Rahul Yatra, Amid Covid Alert, Mango News, Mango News Telugu, Bharat Jodo Yatra, Sonia Gandhi, Priyanka Vadra, Sonia and Priyanka Join Rahul Gandhi In Bharat Jodo Yatra, Bharat Jodo Yatra enters Delhi, Rahul Gandhi Bharat Jodo Yatra, Bharat Jodo Yatra Latest Updates, bharat jodo News, Congress Party News

కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ శనివారం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఒకవైపు కేంద్రం కోవిడ్ హెచ్చరికలు చేస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన యాత్ర నేడు ఢిల్లీలో అడుగు పెట్టడం విశేషం. ఈ క్రమంలో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కాగా, యాత్ర నగరంలోకి ప్రవేశించడంతో ఆగ్నేయ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ జోడో యాత్ర యొక్క ఉద్దేశ్యం నిజమైన హిందుస్థాన్ ని ప్రదర్శించడం అని పేర్కొన్నారు. బీజేపీ అనుసరించే ద్వేషంతో నిండిన సంస్కరణ వలె కాకుండా, ఈ యాత్రలో పాల్గొనే ప్రజలు ఒకరికొకరు ప్రేమ మరియు సహనంతో కూడిన మార్గాన్ని అనుసరిస్తారని చెప్పారు.

ఇక 100 రోజుల పైబడి కొనసాగుతున్న ఈ యాత్రలో పాల్గొని మద్దతు అందించిన లక్షలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రాహుల్ గాంధీ. కాగా హర్యానా నుండి రాజధాని నగరంలోకి ప్రవేశించిన బదర్‌పూర్ సరిహద్దు నుండి ప్రారంభమయిన జోడో యాత్ర నేడు ఢిల్లీలో దాదాపు 23 కి.మీ మేర సాగనుంది. మధ్యాహ్నం కొద్దిసేపు భోజన విరామం అనంతరం ఎర్రకోట వద్ద ముగుస్తుంది. ఇక ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సహా మరికొందరు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. అయితే ఈరోజు యాత్ర ముగిసిన తర్వాత దాదాపు 8రోజులు విరామం ప్రకటించారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు తదితర కారణాలతో యాత్ర జనవరి 3న తిరిగి కాంగ్రెస్ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + two =