తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల, 9168 పోస్టుల భర్తీ, వివరాలివే…

TSPSC Releases Group-4 Notification for the Recruitment 9168 Posts of Various Departments,Telangana Group-4 notification,Telangana Group-4 notification released ,9168 Group-4 posts filled, Group-4 posts apply,Group-4 posts from Dec23 to Jan12,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఊపందుకుంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీలో భాగంగా గ్రూప్-1, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదలై ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. గ్రూప్-4 కింద 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్‌-4 కు సంబంధించి 25 విభాగాలకు చెందిన 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌, వార్డ్‌ ఆఫీసర్‌ సహా పలు రకాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. అలాగే గ్రూప్-4 పరీక్షను (ఆబ్జెక్టివ్ టైప్) 2023, ఏప్రిల్/మే లలో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అదేవిధంగా ఖాళీల విభజన, వయస్సు, వేతన స్కేల్, కమ్యూనిటీ, విద్యార్హతలు మరియు ఇతర సూచనలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ డిసెంబర్ 23 నుండి కమిషన్ వెబ్‌సైట్‌ లో https://.tspsc.gov.in/ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =