జంగారెడ్డిగూడెం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం

26TDP President Chandrababu Naidu Meets Representatives of BC Communities at Jangareddy Gudem Today,Chandrababu Jangareddygudem visit,TDP Chandrababu Tour,BC communities Tour,Mango News,Mango News Telugu,TDP Chandrababu Naidu,Jagan plays BC card in Kuppam, says Chandrababu Naidu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెద్దవేగి మండలం విజయరాయి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’? కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గురువారం జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా పలువురు బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నియోజక వర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, ప్రజలను పట్టించుకునేవారే లేరని మండిపడ్డారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘ఆదరణ’ పథకం అమలు చేశామని, బీసీల కోసం ప్రత్యేకంగా రూ. 34,400 కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ అధికారం చేపట్టాక బీసీలకు రిజర్వేషన్లతో పాటు రాజకీయ ప్రాధాన్యత తగ్గించారని మండిపడ్డారు. 50 శాతం జనాభా 140 బీసీ కులాల కోసం ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో 37 మంది మెంబర్స్ ఉంటే, బీసీలకు కేవలం మూడు పదవులు ఇచ్చారని, యూనివర్శిటీల్లో వీసీలనే కాదు, రిజిస్ట్రార్లను కూడా బీసీలకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఒకవైపు సీఎం జగన్ సభలకి రానివారికి క్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, మరోవైపు సభలకు వచ్చిన ఆడపిల్లల చున్నీలను తీసేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి ‘అన్న క్యాంటీన్స్’ పెడితే బలవంతంగా మూసేయిస్తున్నారని, అన్నం పెట్టడంలో తప్పేముందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =