తెలంగాణలో టీఆర్‌టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల

Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, Telangana TRT SGT Results, TRT SGT Telugu Medium Selection List, TSPSC Releases TRT SGT Selection List, TSPSC Releases TRT SGT Telugu Medium Selection List

టీఆర్‌టీ ఎస్జీటీ తెలుగు మీడియం తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ 11, శుక్రవారం నాడు విడుదల చేసింది. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా చేపట్టిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ)లో 3,325 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 2017లో వెలువడిన ఈ నోటిఫికేషన్‌ ఫలితాలు పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి, ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం ఫలితాలు ముందు వెల్లడించడం, తర్వాత కొంతమంది అభ్యర్థులు రీలింక్విష్‌మెంట్‌ తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించడంతో తుది ఫలితాల విడుదలకు ఆలస్యం అయింది.

3,786 పోస్టులలో 3,325 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరిగింది, కొన్ని కారణాలవలన మిగిలిన పోస్టులకు ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు 15 రోజుల్లో షెడ్యూలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యా శాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం పోస్టుల ఫలితాలను కూడ అతి త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. అనంతరం గ్రూప్‌–2 ఫలితాలు కూడ విడుదల చేయబోతున్నారు.

[subscribe]