హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమిదే…?  

What Is The Reason For Real Estate Fall In Hyderabad?, Reason For Real Estate Fall In Hyderabad,Real Estate Fall In Hyderabad,Real Estate Fall, Reason For Real Estate Fall,Real Estate,Hyderabad,Amarvathi, Hyderabad,Evanth Reddy,Pm Modi,Telangana,Telangana Politics,Rahul Gandhi,Telangana Live Updates,Telangana,Mango News, Mango News Telugu,
real estate, Hyderabad, real estate fall in Hyderabad, amarvathi

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం అంటే అందరికీ ఐటీ సంస్థలు గుర్తుకు వస్తాయి. అంతే కాదు నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. ఒకానొక దశలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా నడిచింది. కోకాపేట లాంటి ఏరియాలో ఎకరం వంద కోట్ల వరకు పలికింది. అయితే ఇటీవల త్రైమాసికంలో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌ఈక్విటీ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో 36 శాతం వరకు తగ్గిన ఇళ్ల విక్రయాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్-జూన్ రెండో త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయాయి. దీనికి ప్రధానం కారణం ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం.

చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవడం తో  అమరావతి భవితవ్యం మారిపోయింది. ఐదేళ్లుగా  అమరావతిలో ఎవరు పట్టించుకోని  పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అమరావతి దాని వనరులు , భారీ విస్తీర్ణం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తదుపరి పెద్ద వస్తువుగా మారే అన్ని అవకాశాలను కలిగి ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కొనుగోలుదారులు హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. సాధారణంగా, కొనుగోలుదారులు భవిష్యత్తులో తమ విలువను పెంచే ప్రాపర్టీస్ ఎంచుకుంటారు. దీంతో రెండో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు హైదరాబాద్‌ కంటే అమరావతికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని గత ఐదేళ్లుగా పీడిస్తున్న స్తబ్దత మెల్లగా వీడుతోంది. భవిష్యత్తు ఏమవుతుందో తెలియక నలిగి పోయిన వాళ్లంతా మెల్లగా ఊపిరి పీలుస్తున్నారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక ఇన్నాళ్లు గందరగోళానికి గురైన వారికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తో ఓ స్పష్టత వచ్చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 17 అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లను గుర్తించినట్లు కొలియర్స్ రిపోర్టులో తెలిపింది. ఆ జాబితాలో తిరుపతి, విశాఖపట్నం నగరాలకు చోటు కల్పించింది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వృద్ధికి మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్ ఆధ్యాత్మిక పర్యాటకం టాప్ డ్రైవర్లుగా ఉన్నట్లు పేర్కోంది. ఏపీ ప్రభావంతో హైదరాబాద్‌లో అమ్మకాలు భారీగా తగ్గాయని పరిశీలకులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF