ఆ కేసులో మల్లారెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..

Will Ex-Minister Mallareddy Be Arrested In The Land Grab Case?,Mallareddy Be Arrested In The Land Grab Case?,Ex-Minister Mallareddy, Land Grab Case,Madchel,Arrest,Ex-Minister,Malla Reddy In Another Land Grabbing,Hyderabad Ex-Minister Malla Reddy,Land Grabbing Issue Malla Reddy,Land Grabbing Case,Telangana ,Hyderabad,Mango News,Mango News Telugu
ex-minister Mallareddy, arrest, land grab case, madchel

మల్లారెడ్డి.. తెలంగాణలో ఈ పేరు ఎంతో ఫేమస్. పంచ్‌ డైలాగులు వేస్తూ తన కంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పాలమిన్న, పూలమిన్న అంటూ డైలాగులు చెప్పి సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద రచ్చ చేశారు. మల్లా రెడ్డికి మాస్ డైలాగులు చెప్తారనే పేరుతో పాటు.. కబ్జా కింగ్ అనే పేరు కూడా ఉంది. మేడ్చల్‌లో పెద్ద ఎత్తున భూములను కబ్జా చేసి విద్యాసంస్థలు నిర్మించారనే ఆరోపణ ఆయనపై ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డిపై అనేక కబ్జా ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అటు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఇప్పటికే మల్లారెడ్డిని పోలీసులు ఓసారి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా..? ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తుందా..? అంటూ పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని సుచిత్రలో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కొంత భూమిని కబ్జా చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో 33 గుంటల వివాదాస్పద భూమిపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి కబ్జా చేశారని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి తగు సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు.

అంతేకాకుండా పోలీసులు ఆ భూమికి సంబంధించి హైకోర్టులో నివేదికను కూడా సమర్పించారని.. ఆ భూమికి రక్షణ కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించిందని తెలుస్తోంది. ఈక్రమంలో  ఈ కేసులో మల్లారెడ్డి అరెస్ట్ తప్పదనే వాదన వినిపిస్తోంది. గతంలో అరెస్ట్ అయి కేసు నుంచి తప్పించుకున్నప్పటికీ.. ఈసారి మాత్రం మల్లారెడ్డి కేసు నుంచి తప్పించుకోవడం, జైలు నుంచి బయటికి రావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE