ఈ బ్లడ్ టెస్ట్ ఒకటి చాలు.. ఎన్నో రోగాలను బయటపెడుతుంది..

A Single Blood Test Can Reveal Many Diseases

మన శరీరంలోని చాలా రోగాలు బ్లడ్ టెస్ట్ ద్వారానే బయటపడతాయని డాక్టర్లు చెబుతూ ఉంటారు. చాలా బ్లడ్ టెస్ట్‌ల గురించి మనదరం వినే ఉంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే బ్లడ్ టెస్ట్ మాత్రం గేమ్ ఛేంజర్ లాంటిదని నిపుణులు అంటున్నారు.

ఈ టెస్ట్ చేయించుకుంటే చాలు ఏకంగా 12 రకాల క్యాన్సర్లను ముందే పసిగట్టేస్తుంది. యూకే ప్రభుత్వం దీనికి సంబంధించిన టెస్టుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి త్వరలోనే ఆమోదం తీసుకోనుంది. ఈ బ్లడ్ టెస్ట్ కోవిడ్ సమయంలో చేసిన పీసీఆర్ టెస్ట్ లాగే ఉంటుందని అంటున్నారు. ఈ బ్లడ్ టెస్ట్‌కి సంబంధించిన రీసెర్చ్ కోసం ..నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ ఏకంగా యూకే ప్రభుత్వానికి 3.28 మిలియన్ డాలర్ల ఫండ్స్ ను కూడా ఇచ్చింది.

ఈ గేమ్ ఛేంజింగ్ బ్లడ్ టెస్ట్ మరో ఐదేళ్లలో ప్రపంచం అంతటా అందుబాటులోకి వస్తుంది. ఊపిరితిత్తులు, బ్రెస్ట్, ప్రోస్టేట్‌తో పాటు ఎన్నో రకాల క్యాన్సర్లను ముందే పసిగడుతుంది. ఈ టెస్ట్ చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి 157 డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మిగిలిన సమయం, డబ్బులు చాలా ఆదా అవుతాయని అంటున్నారు పరిశోధకులు. దీనివల్ల అనవసరపు డయాగ్నసిస్, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.

ముందుగానే సమస్య తెలియడం వల్ల వెంటనే చికిత్స తీసుకుంటారు కాబట్టి మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎక్స్ జెనెరా అనే స్టార్టప్ సంస్థ ఈ బ్లడ్ టెస్ట్‌లు నిర్వహించే పనిలో పడింది. యూకేలో ఏడాదికి 3,20,000 మంది ఏదో ఒక రకమైన క్యాన్సర్ల బారిన పడుతున్నట్లు యూకే ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా.. కోవిడ్ వల్ల ఒక్క సంవత్సరంలోనే 40,000 మందికి క్యాన్సర్లు ఉన్నట్లు కూడా గుర్తించలేకపోయారు. త్వరలో రానున్న బ్లడ్ టెస్ట్ వల్ల క్యాన్సర్ మరణాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని యూకే ప్రభుత్వం ఆశిస్తోంది.