బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్ల ప్రక్రియ కాస్త మసాలా దట్టించినట్లే సాగింది. కంటెస్టెంట్ల మధ్య రకరకాల గొడవలు, ఆరోపణల మధ్య ముగిసిన ఈ వీక్ ఎలిమినేషన్ల కోసం ఆరుగురు కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే వీరందరిలో మణికంఠ తీరు, ప్రవర్తన మాత్రం చాలా గమ్మత్తుగా ఉందన్న టాక్ నడుస్తోంది. మణికంఠ ఆటపై, ఆటతీరుపై సానుభూతి చూపాలా? లేదా ట్రోల్ చేయాలా? అనే మిక్స్‌డ్ ఫీలింగ్‌లో నెటిజన్లు, బిగ్‌బాస్ ఆడియెన్స్ ఉన్నారు.అయితే నామినేషన్ పూర్తయిన తర్వాత మణికంఠ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ చూసి ఆడియన్సే కాదు కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు.
ఫస్ట్ వీక్‌లోనే నామినేషన్లు హాటు హాటుగా మొదలై.. అంతే ఘాటు స్థాయిలో పూర్తయ్యాయి. అయితే అంతమంది కంటెస్టెంట్లు కూడా మణికంఠ గేమ్‌పైనే టార్గెట్ చేశారు. అతడి వ్యవహార శైలిపై ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. అయితే తన జీవితం గురించి మణికంఠ చెప్పుకొనే విధానంతో పాటు.. తన లైఫ్‌లో విషాదాల గురించి పదే పదే చెప్పుకోవడం కంటెస్టెంట్లకు చిరాకు తెప్పించి చివరకు అదే కాంట్రవర్సీగా మారింది.
ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రకరకాల వాగ్వాదం అనంతరం ఆ పక్రియ ముగిసింది. ఫస్ట్ వీక్‌లో బేబక్క, విష్ణు ప్రియ భీమినేని, మణికంఠ, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేదనే కారణంతో నామినేట్ చేశారు. దీంతో ఈ వీక్ ఎలిమినేషన్ లిస్టులో ఆరుమంది కంటెస్టెంట్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా, నామినేషన్ ప్రక్రియ తర్వాత మణికంఠ భోరున ఏడ్చాడు. తనలో తాను కుమిలి పోతూనే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే మణికంఠను ఇలా చూసిన హౌస్ మేట్స్ అంతా అతనిని ఓదార్చడానికి అతడి వద్దకు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే తనలో బాధను తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్వడంతో..బిగ్ బాస్ మణికంఠను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి చక్క దిద్దే పరిస్థితిని చేశాడు.
బిగ్‌బాస్‌తో మాట్లాడుతూ.. తన లైఫ్ అంతా రోలర్ కోస్టర్‌లా ఉందని మణికంఠ చెప్పాడు. తాను ఎలా ఉన్నా అబద్దం ఆడనని.. నిజాలు మాత్రమే చెప్పానని అన్నాడు. బిగ్‌బాస్ తర్వాత తనకు జీవితం ఉందా? తన భార్య కావాలని..? తన అత్తమామల నుంచి గౌరవం కావాలని…చెప్పుకొచ్చాడు అంతేకాదు..తన మారుతల్లి కావాలని..తన కూతురు నాకు కావాలని అన్నాడు. తన లుక్స్ మెయింటెన్ చేయాలని అనుకొన్నాను. కానీ తన వల్ల కావడం లేదు అని అంటే తన మనసులోని బాధను వెళ్లగక్కాడు. దీంతో బిగ్ బాస్..మీరు అనుకొన్నది సాధిస్తారని ఇంత తర్వగా ధైర్య కోల్పోవద్దు అన్నారు.
ఇంటిలోని కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. మణికంఠ తన విగ్‌ను తీసేశయడంతో..అందరూ షాక్ అయ్యారు. ఇప్పటి వరకు అతడిది సొంత జుట్టు కాదా? విగ్ పెట్టుకొని మేనేజ్ చేశాడా? అంటూ అంతా ఆశ్చర్యపోయారు. మణికంఠకు బిగ్‌బాస్ ధైర్యం ఇవ్వడంతో తన నవ్వును తన ముఖంపై ఉంచుకొంటానని..తన ఆటను తాను ఆడుతానని చెప్పడంతో బుధవారం షోకి ఎండ్ కార్డ్ పడింది.