కంటెస్టెంట్ల మధ్య ముదురుతున్న పాకం.. నామినేషన్లలతో హీట్ పెరిగిన బిగ్ బాస్ హౌస్

Bigg Boss House Heats Up With Nominations

బిగ్‌బాస్‌లో ఈ వారం సోనియాను నామినేట్ చేసింది యష్మీ. సోనియాను నామినేట్ చేయడానికి రీజన్ చెప్పిన యష్మీ.. నేను నిన్ను నా క్లాన్‌లోకి తీసుకుంది ఎందుకంటే నేను తప్పు చేసినా మాట్లాడతావని తీసుకున్నా.. కానీ నువ్వు ఆ రూల్ ఫాలో అవ్వలేదు.. కానీ నిఖిల్ క్లాన్‌లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలు ఇస్తున్నావ్.. ఇక నా రెండో పాయింట్.. ఎగ్ టాస్కు గురించి ఇందాక మాట్లాడుతూ నువ్వే చెప్పావ్.. నిఖిల్, పృథ్వీ అగ్రెషన్ నీ స్ట్రెంత్ అని.. ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావ్ తప్ప నువ్వు ముందుకు రాలేదు ఆడటానికి.. ఇద్దరి సపోర్ట్ లేకుండా.. నువ్వు సెపరెట్‌గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించిందంటూ చెప్పుకొచ్చింది.

దీనికి సోనియా వాళ్లని ముందు పెట్టి.. నేను ఆడలేదు అంటున్ననావ్ కదా.. అవును నేను అగ్రీ చేస్తా.. కానీ నేను ఇక్కడున్న అందరి మగాళ్ల కంటే కూడా అగ్రెషన్‌లో ఎక్కువే.. నా అగ్రెషన్ వల్ల ఎవరినీ హర్ట్ చేయకూడదని అనుకున్నా.. నేను గేమ్‌లోకి దిగాక ఎవరిని కొడతానో నాకే తెలీదు.. ఎందుకురా బాబు కొట్టకుండా ఉండాలని.. అనుకున్నా.. అయినా కూడా మీ ఫెయిల్డ్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం ఇచ్చాడు.. అందుకే చివరిలో వచ్చి ప్రేరణను, నిన్నూ ఎత్తేసింది కూడా నేనేనంటూ సమాధానం చెప్పింది.దీంతో పాటు వీరిద్దరి మధ్య కాసేపు ఎగ్ టాస్క్ తర్వాత గుడ్లు దొంగిలించడం పైన వార్ నడిచింది.

దీనికి కూడా సోనియా ఏదో కవర్ చేయడానికి ట్రై చేయగా ఫిజికల్ టాస్కులో నాకు నీ ఆట కనిపించలేదని యష్మీ అనడంతో. చూడాలి కదా యష్మీ ఎంతసేపు నిఖిల్, పృథ్వీలను చూస్తే ఎలా అంటూ సోనియా రెచ్చగొట్టింది. దీంతో “అవును నా ఇష్టం.. కావాలంటే నిఖిల్‌నే చూస్తా.. నా ఇష్టం ఎవరిని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతా.. నీలాగ వాళ్లని వదిలేసి నిల్చోవట్లేదు.. అయినా ప్లేటు ఎలా తిప్పాలో.. ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్‌గా నీకు సూపర్‌గా తెలుసంటూ సోనియా పరువు తీసింది యష్మీ.

ఇక దీనికంటే ముందు తన మొదటి నామినేషన్ మణికంఠకి వేసింది యష్మీ. వాళ్లిద్దరి మధ్య కూడా గట్టిగానే డిస్కషన్ నడించింది. హౌస్‌లో మణికంఠ అయినా ఉండాలి.. లేదంటే తాను అయినా ఉండాలంటూ యష్మీ మంగమ్మ లెవల్లో శపథం చేసింది. ఇక మొత్తంగా ఈ వారం నామినేషన్లలోకి మొత్తం ఏడుగురు సభ్యులు వచ్చారు.

పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్, ప్రేరణ నామినేషన్లలోకి రాగా చీఫ్ అవడంతో.. నిఖిల్‌కి ఓ సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని వల్ల నామినేషన్లలో ఉన్న ఎవరో ఒకరిని నిఖిల్ సేవ్ చేయొచ్చు. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా తన ఫ్రెండ్స్ అయిన పృథ్వీ, సోనియాలను కాకుండా తెలివిగా నైనికను సేవ్ చేశాడు నిఖిల్.బిగ్‌బాస్ కారణమేంటి అని అడగ్గా.. నామినేషన్లలో నైనిక గురించి చెప్పిన రీజన్ స్ట్రాంగ్‌గా లేదంటూ నిఖిల్ సమాధానమివ్వడంతో సోనియా కాస్త షాక్ అయినట్లే కనిపించింది.