బిగ్ బాస్ 8 రెండో వారం నామినేషన్స్

Bigg Boss Telugu 8 Second Week Nominations, Bigg Boss Telugu 8, Bigg Boss Vishnupriya, Contestants, Second Week Nominations, Bigg Boss, Bigg Boss Nominations, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ ఆడియన్స్ కోరుకునేలా వాడి వేడిగా సాగాయి. మొదటి వారం నామినేషన్స్‌లో కాస్త సైలెంట్‌గా ఉన్నవారు కూడా సెకండ్ వీక్ నామినేషన్స్‌లో మాత్రం గట్టిగా కౌంటర్ అటాకింగ్ కు దిగారు.

మొదటి వారంలో పెద్దగా మాట్లాడని కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియ ఈసారి మాత్రం ధీటుగా సమాధానాలు ఇచ్చారు.బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్లో.. బేబక్క ఎలిమినేషన్‌తో కిర్రాక్ సీత, నైనిక బాధపడుతూ కనిపించారు. మంచికి వాల్యూ లేదని, తప్పు చేసినవాళ్లనే సపోర్ట్ చేస్తున్నారని, ఇక నుంచి తాను చెడుపై పోరాటం చేస్తానని సీత బాధపడుతూ చెప్పింది.ఇటు బేబక్క వెళ్తూ తమను రోడ్డుపై పడేసిన విషయం గురించి పృథ్వీ, నిఖిల్, సోనియా కామెడీ చేసుకున్నారు .వీరితోపాటు అభయ్ కూడా యాడ్ అయి నవ్వులకు తోడయ్యాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం ..రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టగా. ఈ నామినేషన్స్‌లో బాగానే గొడవలు జరిగాయి. కానీ, ఆర్జీవీ హీరోయిన్ సోనియా వెర్సెస్ కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియ గొడవే వీరందిరిలో హైలెట్ అయింది. సోనియా ప్రశ్నలకు చాలా ధీటుగా, గట్టిగా సమాధానాలు చెప్పింది కిర్రాక్ సీత.మొన్నటివరకు ఆర్గ్యుమెంట్‌లో తను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యే సోనియా అడిగిన ప్రతి ఒక్క మాటకు వివరణ ఇస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఒక్కోసారి సీత మాటలకు సోనియా స్ట్రక్ అయిపోయింది.

ఆ తర్వాత కొద్దిసేపటికి నామినేట్ చేసే అవకాశం యాంకర్ విష్ణుప్రియకు రాగా.. ముందుగా నాగ మణికంఠను నామినేట్ చేసింది . తన గురించి తెలుసుకోడానికే తనతో క్లోజ్‌గా మూవ్ అవడం అంటే అది మోసం చేసినట్లు అనిపించిందని చెప్పిన విష్ణు పాయింట్‌ను మణికంఠ కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత సోనియాను నామినేట్ చేసింది విష్ణుప్రియ.

తాను చేసింది అడల్ట్ రేటెడ్ జోక్ అని సోనియా చెప్పిందని అది తనకు నచ్చలేదని విష్ణుప్రియ చెప్పింది. తాను క్యాజువల్‌గా జోక్ చేశానని,దానికి సారీ కూడా చెప్పాను అని చెప్పుకొచ్చింది. కానీ, సోనియా అంతపెద్ద ట్యాగ్ ఇచ్చి దానికి వివరణ కూడా ఇవ్వలేదు, సారీ కూడా చెప్పలేదు అని యాంకర్ విష్ణుప్రియ చెప్పింది. దానికి అది సోనియా అది విష్ణుప్రియకు కామెడీ ఏమో తనకు కాదని..తమిద్దరి మధ్య అంత ర్యాపో లేదని చెప్పింది. దూరంగా ఉంటున్నానంటే అది అర్థం చేసుకోవాల్సిందని సోనియా వాదించింది.

అసలు అడల్ట్రీ అంటే ఏంటీ.. తానేం అంతగా 18 ప్లస్ జోక్ వేశానని… సోనియా మైండ్‌లో అలాగే ఉంటుంది. అందుకే తనకు అలా అనిపిస్తుంది అని విష్ణు అంది. దీంతో విష్ణుప్రియ చేసేదంతా అదేనని, అందుకే తన మైండ్‌లో అదే ఉందని సోనియా సమాధానమిచ్చింది. విష్ణుతో ర్యాపో ఉన్నవాళ్లతోనే మాత్రం కామెడీ చేయదని, అటు ఇటు తిరుగుతూ అందరితో అలాగే ఉంటాదని. బట్టలు సరిగ్గా వేసుకోని.. మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా విష్ణుకు తెలియదని సోనియా పర్సనల్ అటాక్ చేసింది. మొత్తంగా కిర్రాక్ సీత, సోనియా, విష్ణప్రియ మధ్య జరిగిన వార్ తో బిగ్ హౌస్ హీటెక్కింది.