సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్‌బాస్ షో..అభిమానుల అంచనాలను ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా సెకండ్ డే కూడా అదే జోష్ ను కంటెన్యూ చేసింది. మొదటిరోజు కంటెస్టెంట్స్ ఎంట్రీలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బిగ్ బాస్ షో.. మూడో రోజునే నామినేషన్ రచ్చ మొదలైంది.
ఈ సీజన్లో బిగ్ బాస్ హౌజ్‌కు కెప్టెన్ ఎవరు ఉండరని .. ఆ స్థానంలో చీఫ్ ఉంటారని చెప్పి కొన్ని గేమ్స్ పెట్టగా..అందులో నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్‌గా ఎంపికయ్యారు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం తొలి నామినేషన్ ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ప్రసారం చేయనున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
ప్రోమో విషయానికొస్తే.. ముగ్గురు చీఫ్స్ నిఖిల్, యష్మి, నైనిక కుర్చీల్లో కూర్చుని ఉంటారు. మిగిలిన వాళ్లలో ఒక్కో హౌస్‌మేట్ తలో ఇద్దరిని నామినేట్ చేయాలి. సోమవారం గొడవలతో హాట్ టాపిక్ అయిపోయిన సోనియా… బేబక్కను, ప్రేరణని నామినేట్ చేసింది. సోనియా,బేబక్క మధ్య కుక్కర్ పంచాయితీ నడిచింది.
కిచెన్‌లో అజాగ్రత్తగా ఉన్నారంటూ నామినేషన్ కోసం చెప్పిన సోనియా.. బేబక్కని నామినేట్ చేసింది. దీంతో కుక్కర్ పనిచేయకపోతే తానేం చేయాలని బేబక్క అసంతృప్తి వ్యక్తం చేసింది. కుక్కర్ లోపల ప్రెజర్ ఉంటుందని ..ఆ ప్రెజర్ తగ్గేవరకూ మనం ఆగాలని చెప్పి బేబక్క వివరణ ఇవ్వడం చూస్తుంటే ఈసారి నామినేషన్‌లో కుక్కర్ పంచాయితీ బాగా హైలైట్ అయినట్లు అనిపిస్తోంది.
మరోవైపు మణికంఠ.. శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం గట్టిగానే నడిచింది. అయితే ప్రోమో చివర్లో యష్మి పరుగెత్తుకుంటూ వచ్చి బేబక్క ఫోటోపై కత్తిని గుచ్చడం చూస్తుంటే ఈ వారం మణికంఠ, బేబక్కపై ఎలిమినేషన్ అనే కత్తి వేలాడటం పక్కా అనే అనిపిస్తోంది. మిగతా వాళ్ల కంటే వీళ్లిద్దరే ఎక్కువ టార్గెట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.మరి ఈ రోజు ఎలాంటి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి మరి.