ఇటీవలే ప్రారంభం అయిన.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 వరుసగా ఆరో సీజన్‌కీ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నా కూడా ఊహించని స్పందన మాత్రం రావడం లేదు. ఆదివారం ఎపిసోడ్‌తో ప్రారంభమయిన బిగ్‌బాస్ సీజన్ 8 కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కంటే.. నెగటివ్ కామెంట్సే ఎక్కువ వస్తున్నాయి.
ఒక్కరిద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా తెలియదన్న న్యూస్ ట్రెండ్ అవుతుంది. పోనీ ఆ ఒక్కరు ఇద్దరయినా కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి కంటెస్టెంట్స్ తో సీజన్లో అన్ని ఎపిసోడ్స్ తో ఎలా నెట్టుకు వస్తారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ఎవర్రా మీరంతా అంటూ ట్రోల్స్, మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
దీంతో నిర్వాహకులు ఈ కంటెస్టెంట్స్ తో.. షో ను సక్సెస్ దిశగా తీసుకు వెళ్లడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ లో గొడవలు ఉంటేనే ఆట రక్తి కడుతుందన్న కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యి.. మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ పెట్టే ప్రయత్నాలు జరిగాయి. అలాగే హౌస్ లోకి పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించడానికి కూడా నిర్వాహకులు రెడీ అవుతున్నారు.
అంతేకాదు ప్రత్యేక అతిథులు కూడా ఈ సారి హౌస్ లోకి తీసుకువెళ్లి .. షోలో ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిలో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలోనే నాగ చైతన్య, శోభితలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్ లో గెస్టులుగా అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతూ, శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.