చాలా మందికి టీ తాగే ముందు మంచినీళ్లు తాగడం అలవాటు. టీ తాగే ముందు నీరు తాగడం వల్ల ప్రయోజనాలున్నాయని కొంతమంది,అలా చేయడం మంచిది కాదని మరికొంతమంది చెప్పడం తప్ప దాని గురించి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే టీ తాగే ముందు ఒక గ్లాస్ నీరు తాగితే జీర్ణక్రియకు మంచిదని కొంతమంది చెబుతారు.
టీ లేదా కాఫీ వంటి పానీయాలతో కొన్ని సందర్భాల్లో అసిడిటి కలిగించవచ్చు. అయితే టీ, కాఫీ తాగే ముందు నీరు తాగడం ఆమ్లస్థాయిలను తగ్గించి, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. నీరు తాగడం వలన గ్యాస్ట్రిక్ రసాలు అదుపులో ఉంటాయి,దీనిద్వారా అసిడిటి సమస్య తగ్గుతుంది.
టీ కాఫీ వంటివి డీహైడ్రేషన్ కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శరీర పనితీరుపై ప్రభావం చూపుతాయి. టీ తాగడానికి ముందు నీరు తాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్ గా ఉండి..శక్తిని కాపాడుతుంది.
టీ తాగే ముందు మంచి నీళ్లు తాగితే.. నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. టాక్సిన్స్ బయటకు పోయి చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా చేస్తుంది.
టీ తాగడం ద్వారా కెఫిన్ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో నిద్రలేమి, ఉత్కంఠ, ఇతర అనారోగ్య సమస్యలను కలిగించొచ్చు. కాబట్టి, ముందుగా నీరు తాగడం ద్వారా కెఫిన్ ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించొచ్చు.