టెలికాం చట్టంలో వచ్చిన మార్పులు తెలుసా?

Do You Know The Changes In The Telecom Act?,Changes In The Telecom Act,Telecom Act,Telecom, Do Not Disturb, National Security Issues, Telecom Act To Come Into Force, The Changes In The Telecom Act,New Telecom Law Comes Into Effect,Telecommunications Act 2023 ,Know All About The Telecom Act,Multiple Sections Of Telecom,Impacts Of Telecommunications Act 2023, Political News,Mango News, Mango News Telugu,
National security issues,Do-Not-Disturb,Telecom Act to come into force,the changes in the Telecom Act

కొత్త టెలికాం చట్టం 2023 , జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చేసింది. చట్టంలోని సెక్షన్లు 1, 2, 10 నుంచి 30, 42 నుంచి  44, 46, 47, 50 నుంచి 58, 61, 62 వరకు నిబంధనలు కూడా బుధవారం నుంచి  అమల్లోకి వచ్చాయి.ఈ  కొత్త టెలికాం చట్టం ఇండియన్ టెలీగ్రాఫ్ చట్టం (1885), ఇండియన్ వైర్‌లెస్ టెలీగ్రాఫ్ చట్టం (1933) వంటి ప్రస్తుత చట్టాలను కూడా భర్తీ చేస్తుంది.

ఎమర్జెన్సీ టైములో  ఏదైనా టెలికాం సేవలు లేదా నెట్‌వర్క్‌ని నియంత్రించడానికి కొత్త టెలికాం చట్టం ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. సేఫ్టీ , పబ్లిక్ ఆర్డర్ లేదా నేరాల నివారణ కోసం ప్రభుత్వాలు టెలీ కమ్యూనికేషన్ సర్వీసులపై నియంత్రణను కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సేఫ్టీ, పబ్లిక్ ఆర్డర్ లేదా నేరాల నివారణ వంటి కారణాలతో టెలికాం సర్వీసులను ప్రభుత్వం నియంత్రించొచ్చు. ఇది కాకుండా, సిమ్ కార్డులకు సంబంధించి కూడా ఈ  టెలికాం చట్టంలో కఠినమైన నిబంధనలు చేసింది

టెలికాం చట్టం 2023 గురించి చెప్పుకుంటే.. ఇది చాలా కఠినమైన నిబంధనలు కలిగి ఉంది. ఈ చట్టంలో నకిలీ సిమ్ కార్డుల జారీని నిషేధించే రూల్ ఉంది. ఒక గుర్తింపు కార్డుపైన 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే వారికి  రూ.50,000 జరీమానా ఉంటుంది. ఆ తర్వాత కూడా  అదే పనిని రెండోసారి చేస్తే, అప్పుడు రూ. 2 లక్షల వరకు జరీమానా విధించొచ్చు. సిమ్‌ను అమ్మేముందు బయోమెట్రిక్ డేటాను తీసుకుంటారు. ఆ తర్వాత మాత్రమే సిమ్ కార్డును జారీ చేస్తారు. ఈ బిల్లు ప్రకారం నకిలీ సిమ్ కార్డులు అమ్మినా, కొన్నా, వాడినా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరీమానా విధిస్తారు. అలాగే ఏ రకమైన సిమ్ కార్డ్ మోసానికి అయినా కూడా మూడేళ్ల జైలు శిక్షతో పాటు, జరీమానా విధిస్తారు.

నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్‌ను పరిగణనలోకి తీసుకుంటే, టెలికాం కంపెనీలు తమ ఫోన్‌లను ప్రభుత్వం గుర్తించిన నమ్మకమైన సోర్సెస్ నుంచి  మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రమోషనల్ మెసేజెస్ పంపడానికి వినియోగదారుల ముందస్తు అనుమతి అవసరం. టెలికాం నెట్‌వర్క్ డేటాను యాక్సెస్ చేయడం, అలాగే అనుమతి లేకుండా కాల్‌లను ట్యాప్ చేయడం లేదా రికార్డ్ చేయడం వంటివి నేరంగా పరిగణించబడుతుంది. దీని వల్ల 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష,రూ. 2 కోట్ల వరకు జరీమానా విధించొచ్చు.

టెలికాం కంపెనీలు వినియోగదారులకు  డు నాట్ డిస్టర్బ్ సర్వీసును నమోదు చేసుకోవడానికి ఒక ఎంచుకోవాలి. అలాగే తరచుగా ఇబ్బంది కలిగించే ఫోన్ కాల్‌ల గురించి కూడా వినియోగదారులు ఇప్పుడు నిరభ్యంతరంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే  చర్యలు తీసుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ