బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..?

Double Elimination This Week, Double Elimination, This Week Double Elimination, Bigg Boss Double Elimination, Bigg Boss Elimination, Actor Nikhil, Aditya Om, Bigg Boss 8 Telugu Double Elimination This Week, Bigg Boss Voting Manipulation, Nabeel, Nagamanikantha, Prerna, Pridhviraj, Sonia, Vishnupriya, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ 8 సీజన్ నాలుగో వారంలో.. డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అలాగే, బిగ్ బాస్ 8 సీజన్లో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో నలుగురు డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని టాక్ నడుస్తోంది.

బిగ్ బాస్ 8 సీజన్ రోజురోజుకీ ఉత్సాహంగా, ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే హౌజ్‌లో 12 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. వారిని ఆపడానికి ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్ అంతా ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్‌లు గెలవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు.

అలా బిగ్ బాస్ ఇచ్చిన 5 ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్స్‌లో రెండు చాలెంజెస్ నిఖిల్ క్లాన్ గెలవగా.. ఒకటి సీత క్లాన్ గెలవగా.. మిగతా రెండు ఫెయిల్ అయిపోయాయి. దీంతో 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో కేవలం ముగ్గురుని మాత్రమే ఆపగలగడంతో 9మంది ఉన్నట్లు అయింది.

అయితే బిగ్ బాస్ 8 సీజన్ నాలుగో వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్త వినిపిస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా వెళ్లే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. వచ్చే 2,3 వారాల్లో వైల్డ్ కార్డ్ ద్వారా 9 మంది కంటెస్టెంట్స్ రావాలంటే.. ప్రస్తుతం హౌజ్‌లో నుంచి ముగ్గురు నుంచి నలుగురిని బయటకు పంపించడానికి బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుందట.

ఇదిలా ఉంటే వీకెండ్ వచ్చేసరికి బిగ్ బాస్ ఓటింగ్ తారుమారయింది. తొలి రోజు నుంచి టాప్‌లో దూసుకుపోతున్న నబీల్ అదే స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న నాగ మణికంఠ మాత్రం మూడో స్థానానికి పడిపోయాడు.

ఇక మూడో స్థానంలో ఉన్న ప్రేరణ ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చేసింది. ఇక అన్‌అఫీషియల్ ఓట్లల్లో నాలుగో స్థానంలో కొనసాగిన ఆదిత్య ఓం మాత్రం ఇప్పుడు అఫిషియల్ ఓట్లల్లో చివరి స్థానంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక పృథ్వీకి మంచి ఓటింగే నమోదు అవుతోందట. అయితే, సోనియాకు మాత్రం చాలా తక్కువగా ఓట్లు వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

అతి తక్కువ ఓట్లతో చివరి మూడు స్థానాల్లో పృథ్వీ, సోనియా, ఆదిత్య ఓం ఉండటంతో… ఈ ముగ్గురే ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నారట. వీరిలో ఎక్కువ శాతం ఆదిత్యం ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే.. ఆదిత్యతోపాటు సోనియా కూడా ఎలిమినేట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో నబీల్, ప్రేరణ తప్ప పృథ్వీ, నాగ మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం డేంజర్ జోన్‌లో ఉన్నారట.