డేంజర్లో గూగుల్ క్రోమ్ యూజర్లు

Google Chrome Users In Danger

ఏ చిన్ని సమాచారం కావాలన్నా కూడా అంతా కూడా గూగుల్ క్రోమ్ నే ఉపయోగిస్తుంటాం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ చాలామంది గూగులమ్మ చెంత ఉండగా..చెంత ఎందుకు అన్నంతగా అలవాటు చేసుకున్నారు. ప్రతీ ఆఫీసులో కూడా గూగుల్ క్రోమ్ లేని సిస్టమ్ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం ఈ మధ్య కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.

గూగుల్ క్రోమ్ యూజర్లకు మొదటి పెద్ద భద్రతా ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. విండోస్ లేదా మాకోస్ సిస్టమ్‌లలో వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారంతా ఇప్పుడు అలర్ట్ గా ఉండాలని సీఈఆర్‌టీ-ఐఎన్ అంటే .. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ స్పష్టం చేసింది. ముఖ్యంగా హ్యాకర్లు మీ సిస్టమ్‌ను క్రోమ్ ద్వారా టార్గెట్ చేసే డేంజర్ ఉందని పేర్కొంది. అందుకే గూగుల్ బ్రౌజ్ చేసే సమయంలో పర్మిషన్స్ ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఐఎన్ కోరింది.

స్కియా, వీ8 వంటి సైట్స్‌ను వినియోగించే వారయితే మరింత జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్‌టీ-ఐఎన్ వివరించింది. అలాగే ఎక్స్‌టెన్షన్స్ ఏపీఐలను ఇన్‌స్టాల్ చేయడాన్ని మానుకోవాలని సూచిస్తుంది. దీనివల్ల రిమోట్ దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. వ్యక్తిగత డేటా చోరీ లక్ష్యంగా హ్యాకర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సీఈఆర్‌టీ-ఐఎన్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్ల పాస్‌వర్డ్స్ వంటివి ఆటో సేవ్ చేసుకుంటే బ్యాంకు అకౌంట్లను కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.

ముఖ్యంగా లినక్స్ 133.0.6943.53 కి ముందు క్రోమ్ వెర్షన్లు వాడే వారికి ఈ డేంజర్ ఎక్కువగా ఉంటుందని ఉందని చెబుతున్నారు. అలాగే విండోస్, మ్యాక్ కోసం 133.0.6943.53/54 కి ముందున్న గూగుల్ క్రోమ్ వెర్షన్లు కూడా డేంజర్లో ఉన్నాయని అంటున్నారు. కాబట్టి క్రోమ్ యూజర్లు కచ్చితంగా లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలని హెచ్చరిస్తున్నారు. క్రోమ్ ఓపెన్ చేసిన ప్రతీసారి క్రోమ్‌లో రైట్ సైడ్‌లో ఉన్న త్రీ డాట్స్‌ను సెలెక్ట్ చేసి మెనూకు వెళ్లి ..అప్‌డేట్స్ చెక్ చేయాలని చెబుతున్నారు.