బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ రోజుకో రకంగా మారిపోతూ ఉంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి ఓటింగ్ భారీగా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, ఈ వారం డేంజర్ జోన్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఉండటంతో షాక్ అయ్యారు. అయితే మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గౌతమ్ గ్రాఫ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూ వెళ్తుంది. గౌతమ్ ఈ వీక్ మొత్తం టాస్కులు రఫ్ఫాడించేసాడు. సీజన్ 7 లో కసిగా ఆడిన గౌతమ్ అంటే ఆడియన్స్ కి బాగా ఇష్టపడ్డారు. ఆ గౌతమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తిరిగి రావడంతో తన ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక డ్రామా కంఠగా పిలవబడే మణికంఠ గ్రాఫ్ మాత్రం ఈ వీక్ అమాంతం పడిపోయింది.
మొదటి 5 వారాలు సింపతీతో గేమ్‌ని నెట్టుకుంటూ వచ్చిన మణికంఠ ముసుగు, ఇప్పుడు దాదాపుగా తొలిగిపోయిందనే చెప్పొచ్చు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మణికంఠ ఓటింగ్ టాప్‌లో పడుతుందని చెప్పడంతో..అది తలకెక్కించుకున్న అతను ఈ వారం తన గేమ్ ను పూర్తిగా పక్కన పెట్టేసాడు. చివరకు ఆట ఎలాగో ఆడడం లేదు కాబట్టి, ఓటింగ్ గ్రాఫ్ ఎక్కడ తగ్గిపోతుందో అన్న లెక్కలతో పృథ్వీతో కావాలని మరీ గొడవ పెట్టుకున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. ఆడియన్స్ ను మరీ తక్కువ అంచనా వేసిన మణికంఠకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మణికంఠ చీప్ ట్రిక్స్‌తో బాటమ్ లో ఉన్న పృథ్వీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నిఖిల్ ఎలాగో ఓటింగ్లో టాప్ లో ఉండడంతో నిఖిల్ అభిమానులు కూడా పృథ్వీకి ఓట్లు వేయడం వల్ల ఓటింగ్ లో మణికంఠని దాటేశాడు పృథ్వీ. దీంతో లేటెస్ట్ ఓటింగ్ లో ర్యాంకింగ్ ప్రకారం చూస్తే.. నిఖిల్ అందరికంటే టాప్ ఓటింగ్‌తో మొదటి స్థానంలో కంటెన్యూ అవుతున్నాడు.
నిఖిల్ తర్వాతి ప్లేస్‌లో నబీల్ కొనసాగుతుండగా, మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ కొనసాగుతున్నాడు. ఇక నాల్గో స్థానంలో ప్రేరణ ఉండగా, 5 వ స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా నిన్న మొన్నటి వరకు టాప్ 3 స్థానంలో కొనసాగిన మణికంఠ మాత్రం ఇప్పుడు ఆరో ప్లేసులోకి పడిపోయాడు. ఇటు యష్మీకి సంబంధించిన ఫుటేజీ ఈ వారం పెద్దగా రాకపోవడంతో యష్మీ ప్లేస్ 7 కి పడిపోయినా కానీ, డేంజర్ జోన్ లో మాత్రం తను లేదు. ఇక చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ, హరి తేజ ఉండటంతో వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తేలాల్సి ఉంది. అయితే..హరితేజ ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత ఓటింగ్ చెబుతుంది. కానీ ఓటింగ్ కి ఇంకా టైమ్ ఉండటంతో ఏదైనా జరగొచ్చు అనేవాళ్లు కూడా ఉన్నారు. కాగా టేస్టీ తేజ టాస్కులు అదరగొట్టేసాడు కాబట్టి, తేజ గ్రాఫ్ బాగానే పెరిగింది. కాబట్టి హరితేజ అవుట్ అన్న వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి.