ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్ లో లేని గ్రూపిజం..సీజన్ 8లో బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో వచ్చిన వారంతా ఒక గ్రూపు, అప్పటి వరకూ హౌస్ లో ఉన్నవారంతా ఒక గ్రూపు అన్నట్లుగా తయారయింది. తాజాగా ఈ వారం హరితేజ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రస్తుతం ఇంట్లో 10 మంది సభ్యులు ఉన్నారు. అందులో కన్నడ బ్యాచ్ 5 మంది ఒక గ్రూపుగా ఉండగా.. మిగిలిన 5 మంది మరో గ్రూపుగా తయారయ్యారు.
నామినేషన్ లో టేస్టీ తేజ కన్నడ బ్యాచ్ పై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం నిఖిల్, యష్మీ, పృథ్వీ, ప్రేరణ నలుగురు కన్నడ నుంచి వచ్చారు. అయితే తెలుగమ్మాయి విష్ణు ప్రియ పృథ్వీని ఇష్టపడటంతో కన్నడ బ్యాచ్ తో చేరిపోయింది. ఇక మరోవైపు గౌతమ్, అవినాష్ , రోహిణి, టేస్టీ తేజ, నబీల్.. ఈ ఐదు మంది ఒక గ్రూపుగా విడిపోయారు.
ఇంతగా మరీ ఇలా రెండు బ్యాచ్ లుగా విడిపోవడానికి కారణం ఈ వారం నామినేషన్స్ అనే అంటున్నారు. నిఖిల్ చాలా దారుణంగా గ్రూపిజం చేసి మాట్లాడడం నామినేషన్స్ లో ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది. 11వ వారం నామినేషన్ కి సంబంధించి టేస్టీ తేజాను నిఖిల్ నామినేట్ చేశారు. కానీ టేస్టీ తేజ కంటే కూడా యష్మీ పెద్ద తప్పు చేసినా కూడా.. నిఖిల్ ఆ విషయాన్ని దాచిపెట్టి టేస్టీ తేజను నామినేట్ చేయడం ఇటు నెటిజన్స్ కి కూడామ ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా ఈ విషయంపై టేస్టీ తేజా ప్రశ్నించడం..దానికి కన్నడ బ్యాచ్ విరుచుకుపడటంతో.. ఇంతగా గ్రూపిజం పెరిగిపోయిందా అన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు తెలుగు రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 8లో కన్నడ బ్యాచ్ ను ఎందుకు అంత అందలం ఎక్కిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకూ 12 మంది ఎలిమినేట్ అయితే.. 12 మంది కూడా తెలుగు వాళ్లే అయ్యారు తప్ప ఒక్క కన్నడ వాళ్లు కూడా లేరేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల , ఆదిత్య ఓం, నైనిక , కిర్రాక్ సీత, నాగమణికంఠ, మెహబూబ్ , నయని పావని ,గంగవ్వ, హరితేజ ఇలా మొత్తం అందరూ కూడా తెలుగు వాళ్లే. కన్నడ బ్యాచ్ ని ఒక్కరు కూడా పొరపాటున కూడా టచ్ చేయడం లేదు. మరి ఈ గ్రూపిజానికి బిగ్ బాస్ ఇకనైనా చెక్ పెడతాడో.. ఎంకరేజ్ చేస్తాడో చూడాలి మరి.