బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన గౌతమ్ కృష్ణ..హౌస్ మేట్స్‌తో డిఫెండ్ చేసుకున్న తీరు వేరే లెవెల్ అనేలాగే ఉంటుంది. సోమవారం ఎపిసోడ్‌తో ఇక గౌతమ్‌కు టైటిల్ ఖరారు అయిపోయినట్లేనని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే గౌతమ్ ఎవరి గురించి అన్యాయంగా మిగిలిన కంటెస్టెంట్స్ లాగా వారి గురించి వారి వెనుక మాట్లాడడకపోవడమే ఇప్పుడు అతని ప్లస్ అయింది.
ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మనసారా ఆహ్వానించలేకపోతున్నారు పాత కంటెస్టెంట్స్. ఒకవిధంగా చెప్పాలంటే పాత కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ అన్నట్లుగానే బిగ్ బాస్ హౌస్ కనిపిస్తోంది. వీరిలో ముఖ్యంగా గౌతమ్ అంటే నిఖిల్, ప్రేరణ,నబీల్, పృథ్వీ, యష్మీ వంటి వారు అసలు ఇష్టపడటం లేదు. మొదటి వారంలోనే నామినేషన్స్ లోకి వచ్చిన గౌతమ్.. ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లిపోవాలి కానీ..కేవలం మణికంఠ కారణంగా సేవ్ అయ్యాడు.
అయితే ఇప్పుడు అందరి విన్నింగ్ అవకాశాలను పక్కకి నెట్టి, అతను టైటిల్ రేస్ లోకి రావడం గౌతమ్ ఆట,మాట తీరు వల్లే వచ్చింది. దీంతో గౌతమ్ విషయంలో హౌస్ మేట్స్ , ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన సభ్యులు ఇలా ప్రతీ ఒక్కరు కూడా గౌతమ్ ఆట తీరు అద్భుతంగా ఉందని ఎలా అంటున్నారంటూ ఆలోచిస్తున్నారు. గౌతమ్‌పై పెంచుకుంటున్న ఆ అక్కసుతోనే సోమవారం బిగ్ బాస్ హౌస్ లో 9 మందిలో 6 మంది నామినేట్ చేశారు.
నిజానికి గౌతమ్ గ్రూప్ గేమ్స్ ఆడుతూ ఒక్కరినే టార్గెట్ చేయడం వంటి పనులకు దూరంగా ఉంటాడు. నబీల్ లాగా గేమ్స్ విషయం డీలింగ్స్ పెట్టుకొని అస్సలు ఆడడు. తనకి నచ్చిన విధంగా,తన మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ టాస్కులు ఆడుతూ ముందుకు పోతున్నాడు. ఆడియన్స్ కి గౌతమ్ లో నచ్చిన విషయం ఇదే.
సోమవారం నామినేషన్లలో ప్రేరణ అయితే గౌతమ్ పై వ్యక్తిగతంగా ఎన్నో కామెంట్స్ చేసింది. సీతాఫలం విషయంలో తనని చెడుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసావని చెప్పింది. దానికి గౌతమ్ ఫీల్ అయ్యి తాను అది కావాలని చేయలేదని.. కేవలం ఫన్ కోసమే చేశానని చెబుతాడు. కావాలంటే ప్రేరణ కాళ్లు పట్టుకొని చెప్పమన్నా చెబుతానంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు.
తాను మామూలుగా మాట్లాడిన తప్పే, అరిచి మాట్లాడినా.. ఫన్ చేసినా.. ఏం చేసిన తప్పేనని.. అందుకే తాను ఇక్కడ ఎవ్వరితో రిలేషన్ పెట్టుకోలేదని..అందరితో కట్ చేసుకున్నానని ఎమోషనల్ అయి చెబుతాడు గౌతమ్. దీంతో ఇప్పటి వరకూ గౌతమ్ పై అభిమానం పెంచుకున్నవారంతా..ఈ ఎపిసోడ్ తో టైటిల్ విన్నర్ గౌతమ్ అని ఫిక్స్ అయిపోయారు.