సూర్యుడు, చంద్రులు భూమిపై ఎంతో ప్రభావం చూపిస్తాయని మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ రెండు గ్రహాలు భూమికి నిర్ధిష్ట దూరంలో ఉన్నాయి కాబట్టే మనం ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఒకవేళ ఈ రెండు గ్రహాలు కనుక భూమికి ఏమాత్రం దగ్గరగా వచ్చినా సరే మనుషులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూర్యుడు ఒక్క అంగుళం ముందుకు జరిగినా భూమిపై వినాశనమే జరుగుతుంది. సూర్యుడు తన కక్ష్య నుంచి ఒక అంగుళం వెనక్కి జరిగినా భూమిపై మంచు పేరుకుపోతుందని మనకు తెలిసిందే.అయితే చంద్రుడు భూమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చాలామందికి తెలియదు.
నిజానికి చంద్రుడు భూమికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. చంద్రుడు భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తాడని కూడా మనకు తెలిసిందే. ముఖ్యంగా భూమిపై ఉన్న నీటిపైన చంద్రుడి ప్రభావం ఎక్కువగా పడుతుంది. పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు రావడానికి కారణం ఇదేనని నిపుణులు చెబుతారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం మహాసముద్రాలతో పాటు నీటి వనరులపైన కూడా పడుతుంది.
చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ,అలల యొక్క బలాలు బాగా పెరుగుతాయి. దీని వల్ల, సముద్రాలలోని నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఇది తీర ప్రాంతాలలోని తీవ్రమైన వరదలకు దారి తీస్తుంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఉన్న వారు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడు.. భూమికి దగ్గరగా రావడం వలన భూమికి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్‌లపై మామూలుగా కంటే అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది భూకంపాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడు.. భూమికి దగ్గరగా రావడం మానవ జీవితంపై ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపైన కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్ల సూర్యుడు, చంద్రుని మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల భూమిపైన కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు.