సీజన్ 8 ఐదో వారం ఆడియన్స్‌కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్‌లో బేబక్క , ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేషన్ అవడంతో హౌస్‌లో 10 మంది మిగిలారు . ఐదో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ విష్ణుప్రియ, నైనిక, మణి, ఆదిత్య ఓం, నబిల్, నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నారు..దీంతో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
కాంతారా టీమ్ ఐదో వారం ఎక్కువ టాస్క్‌లు గెలుచుకోవడంతో వారికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు . వీరి టీమ్‌లో నుంచి ఒకరు నేరుగా చీఫ్ కావొచ్చునని , అయితే దానిని మీలో మీరు చర్చించుకోవాలని చెప్పాడు. దీంతో యష్మీ తనకు ఆల్రెడీ చీఫ్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందని తన క్వాలిఫికేషన్స్ బయటపెట్టింది. దానికి అభ్యంతరం తెలిపిన పృథ్వీ.. చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని ఒప్పుకున్నావ్, మళ్లీ ఎందుకు అడుగుతున్నావని ప్రశ్నిస్తాడు. దీంతో యష్మీ ఏడుపు స్టార్ట్ చేయగా.. మళ్లీ తనే వచ్చి హగ్ చేసుకుని టీమ్‌లో గొడవ సద్దుమణిగింది.
ఈ సీజన్లీ అంతా కొత్త ముఖాలే దీనికి తోడు.. ఎంటర్‌టైన్మెంట్ కాస్తంత తగ్గిందన్న టాక్ ఎక్కువగా వినిపించడంతో..12 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పించడానికి బిగ్ బాస్ భావిస్తున్నాడు. ఆ 12 మందిలో టేస్టీ తేజా, హరితేజ, అవినాష్, యాంకర్ రవి, మెహబూబ్, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, గలాటా గీతూ కన్ఫర్మ్ అయినట్లు బయట ప్రచారం జరుగుతోంది. అయితే 12 మందిని ఒకేసారి హౌస్‌లోకి పంపిస్తారా లేదంటే.. వారానికి నలుగురు చొప్పున , మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు.. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే నబీల్ 24.9 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నాడు. అనుకోకుండా నామినేషన్స్‌లోకి వచ్చిన నిఖిల్ 24.9 శాతం ఓటింగ్‌తో గట్టి పోటీనే ఇస్తున్నాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా మణికంఠ 18.2 శాతం ఓట్లతో టాప్ 3లో నిలవగా.. యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్‌లో వెనుకబడింది. టాప్‌లో ఉన్న విష్ణుప్రియ ఈ వారం మాత్రం కేవలం 16.7 శాతం ఓటింగ్ వచ్చింది. ఆదిత్య ఓంకు 11.3 శాతం ఓట్లు, నైనికకు 9 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ముందే చెప్పేడంతో .. ఆదిత్య ఓం హౌస్‌ను వీడినట్లుగా వార్తలు వస్తున్నాయి.