అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే జుట్టు రాలిపోతుందంటే తెగ టెన్షన్ పడిపోతారు. అర్జంటుగా చుట్టాల సలహానో.. ఫ్రెండ్స్ సజెసనో తీసుకుని మార్కెట్లో దొరికే ఆయిల్ కొనేసి వాడుతుంటారు. అయితే వందలు వేలు ఖర్చు పెట్టి ఖరీదైన ఆయిల్స్ కొనుక్కునే బదులు మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా అద్భుతమైన హెయిర్ ఆయిల్ను తయారు చేసుకోవచ్చు.
ఆనియన్ ఆయిల్ తయారీ కోసం..
ఆనియన్ హెయిర్ ఆయిల్ తయారీకి పింక్ కలర్లో ఉండే ఉల్లిపాయను తీసుకోవాలి. తెలుపు రంగులో ఉండే ఉల్లిపాయలు అసలు వాడొద్దు. చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకొని పైన ఉన్న పొట్టును తీసి వేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఒక బౌల్ పెట్టుకుని.. అందులో ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాముల ఆవాల నూనె తీసుకోవాలి.
ఆవనూనె బదులుగా కొబ్బరి నూనె అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ మిశ్రమాన్ని యాడ్ చేయాలి .అయితే సన్నని మంట మీద మాత్రమే ఉంచాలి. నూనె వేడి అవకముందే గరిటెతో తిప్పుతూ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి దీన్ని కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు కలిపెడుతూనే ఉండాలి. ఇప్పుడు మనం గ్యాస్ మంట ఆఫ్ చేసుకుని ఒక మూత ఉంచుకోవాలి. కనీసం ఒక రెండు మూడు గంటలు ఇలాగే ఉంచేయాలి. ఒక వారం, రెండు వారాలకు సరిపడా మాత్రమే తయారు చేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఉపయోగించాలి. ఈ విధంగానే కలబంద ఆయిల్ ను కూడా తయారు చేసుకోవచ్చు.
ఉల్లిపాయలు నూనెతో కలిపి రాసుకుంటే మన జుట్టు ఊడటానికి 90 శాతం వరకు అరికట్టవచ్చు ఇక మిగతా 10 శాతం అనేది డైట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది ముఖ్యంగా వీటిలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అలాగే ఇందులో ఉండే సల్ఫర్ అనేది మన జుట్టుకు తగినంత పోషణ ఇచ్చి మన జుట్టు పొడవుగా హెల్తీగా పెరిగేటట్లు చేస్తుంది. అలాగే ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి మన జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. అలాగే వెంట్రుకలు కూడా బలహీనంగా లేకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఆయిల్ మీరు ఎక్కువ మోతాదులో మీ జుట్టుకు రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఈ ఆయిల్ రాసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లను వేడి చేసి అందులో నూనె ఉన్న బౌల్ పెట్టి గోరువెచ్చగా అయ్యేవరకూ వేడి చేసి జుట్టుకు అప్లై చేసుకోండి. ఈ నూనెను కనీసం రెండు లేదా మూడు గంటలపాటు అలాగే ఉంచుకోవచ్చు. లేదా అప్లై చేసుకుని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు.