బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. సీజన్ 8 లో 3వ వారం హౌస్ నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. 3వ వారం ఎవరు ఊహించని విధంగా అభయ్ నవీన్ బయటకు వచ్చాడు. కచ్చితంగా అతను టాప్ 5 లో ఉంటాడని మొదటి రెండు వారాలు ఆట చూసిన వాళ్లు అనుకున్నారు కానీ 3 వ వారం అతను చేసిన తప్పుల వల్ల బయటకు వచ్చాడు. ఇక అభయ్ ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్, సీత, సోనియా బాగా ఫీలయ్యారు. ముఖ్యంగా సీత అయితే బాగా ఏడ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ బిగ్ బాస్ నే టార్గెట్ చేస్తూ నానా మాటలు అన్నాడు అభయ్. అదేదో కామెడీగా అనుకున్నాడు అనుకోవడానికి లేదు. టాస్కుల్లో బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పుబట్టి అభయ్ నానా రచ్చ చేశాడు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అభయ్ కి తను అన్న మాటలన్నీ చూపించి రెడ్ కార్డ్ చూపించారు. ఐతే ఆ కార్డ్ వాడి అప్పుడే బయటకు పంపించాల్సి ఉన్నా హౌస్ మెట్స్ రిక్వెస్ట్ తో ఆపేశారు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అభయ్ కు అందరికన్నా తక్కువ ఓట్లు రావడంతో అతన్ని ఎలిమినేట్ చేశారు. ఆల్రెడీ శనివారం రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి వెళ్లిపో అన్నారు. అప్పుడు హౌస్ మెట్స్ రిక్వెస్ట్ చేస్తే నాగార్జున శాంతించాడు కానీ బిగ్ బాస్ టీం మాత్రం అభయ్ ని వదల్లేదు. నిజంగానే అతను ఓటింగ్ లో లీస్ట్ ఉన్నాడా అన్నది తెలియదు కానీ అభయ్ ని కావాలనే బయటకు పంపించారన్న వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో అభయ్ ది 3 వారాల స్వీట్ అండ్ షార్ట్ జర్నీ అతన్ని హౌస్ లో చాలామంది కంటెస్టెంట్స్ మిస్ అవుతారని చెప్పొచ్చు.
బిగ్బాస్ హౌస్లో సండే-ఫన్డే ఎపిసోడ్ బాగా ఎంటర్టైనింగ్గానే సాగింది. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే తన తింగరి డైలాగులతో నాగార్జునని బాగా నవ్వించింది. ఇక డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా వీలున్నప్పుడల్లా కుమ్మేసింది. ఇక గేమ్ మధ్య మధ్యలో నామినేషన్లలో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్లారు నాగార్జున. చివరికి నవీన్ ఎలిమినేట్ అయ్యాడు.
ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ రచ్చ రచ్చ అయింది. ఈసారి పృథ్వీ, సోనియా, మణికంఠ ఎక్కువగా టార్గెట్ అయినట్లు కనిపించారు. హౌస్మేట్స్ ఒకరిపై ఒకరు గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయాడు. పృథ్వీ టార్గెట్ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఆదిత్య ఓం, నబీల్.. పృథ్వీని నామినేట్ చేశారు. అవమానించేలా గట్టిగా మాట్లాడుతావ్ గానీ సారీ మాత్రం మెల్లగా చెబుతావ్ అని ఆదిత్య తన పాయింట్ చెప్పాడు. దీనికి బదులిచ్చిన వృధ్వీ.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేనెందుకు తీసుకోవాలని రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. ఇక నబీల్ కూడా పృథ్వీనే నామినేట్ చేశాడు. గట్టి గట్టిగా అరుస్తున్నావని, నరాలన్నీ కనిపిస్తున్నాయని, ఆ అరుపుల వల్ల నా మాట నీకు వినిపించడం లేదని కారణం చెప్పాడు.
పృథ్వీ కూడా ఫైర్ ఇక నబీల్ చెప్పిన కారణానికి బదులిచ్చిన పృథ్వీ.. నా ప్రకారం నువ్వు ఫెయిల్, బయాస్(కొందరికే సపోర్ట్) అని కౌంటర్ ఇచ్చాడు. ఎలా కావాలంటే అలా మాట్లాడతా, మెడ దగ్గర నరాల్ని చూపిస్తూ… ఇవి బయటకు పడినా పర్లేదు నేను ఇలానే మాట్లాడుతా అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఈ మధ్యలోనే సోనియా-నబీల్ మధ్య వాగ్వాదం జరిగింది. అలానే తొలి మూడు రోజులు కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదని ఆదిత్య ఆమెని నామినేట్ చేశాడు. మణికంఠకి క్లాస్ గత వారాల్లో ప్రతిదానికి ఓవర్ చేసిన మణికంఠ.. ఈసారి నామినేషన్స్లో మాత్రం కాస్త సైలెంట్గా ఉన్నట్లున్నాడు. నైనిక అతడిని నామినేట్ చేస్తూ.. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే వేరేవాళ్ల కాన్ఫిడెన్స్ తగ్గించొద్దని అతడికి క్లాస్ పీకింది. అలా ప్రోమో మొత్తం మాటలతో కొట్టేసుకుంటారా అనే రేంజులో సాగింది.