బిగ్‌బాస్ హౌస్‌లో రోజురోజుకు కంటెస్టెంట్లు బూతులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం ఎక్కువవుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ప్రేరణ,విష్ణుప్రియల గొడవ చూసి వామ్మో వీళ్లేంటి ఇంత ఘోరంగా కొట్టుకుంటున్నారు అన్పించింది. మరోవైపు పృథ్వీ అయితే సైకోలా వీరవిహారం చేసి.. మణికంఠ మీద బూతులతో రెచ్చిపోయాడు.
ప్రభావతి 2.0 రాకతో బిగ్ బాస్ హౌస్‌లో కోడిగుడ్లు కలెక్ట్ చేసే గేమ్ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్‌లో శక్తి అంటే నిఖిల్ టీమ్ ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేయడంతో.. కాంతార టీమ్ నుంచి నబీల్ ఔట్ అయిపోయాడు. ఇక నబీల్‌ను సంచాలక్ చేయడంతో.. ఈ ఎపిసోడ్‌లో గేమ్ మళ్లీ మొదలైంది.
అంతా ప్రశాంతంగా సాగుతుందనుకునే లోపు సోనియా వెళ్లి కాంతార టీమ్ బుట్టలో ఎగ్స్ కొట్టేయం చూసి.. యష్మీ కూడా వెళ్లి శక్తి టీమ్ గుడ్లు నాలుగు కొట్టేసింది. దీంతో నిఖిల్ ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశాడు. వెళ్లి కాంతార టీమ్ బుట్టలో ఎగ్స్ దోచేశాడు. దీంతో నిఖిల్,యష్మీ మధ్య కాసేపు డైలాగ్ వార్ నడిచింది. ఓ వైపు మాటలతో యష్మీ రెచ్చగొడతుంటే ఆదిత్య మాత్రం ప్లీజ్ నిఖిల్ అంటూ బతిమాలుకున్నాడు.
నీ ఇష్టమొచ్చింది చేసుకో పో అని యష్మీ నిఖిల్‌తో అనడంతో.. రెచ్చిపోయిన నిఖిల్.. “దమ్ముంటే ఆపు.. నేను మూసుకొని వెళ్తుంటే నన్ను ఎందుకంటున్నావ్ అంటూ మీదకి వెళ్లాడు. ఇక కాంతార టీమ్ చీఫ్ అయిన అభయ్ అయితే ఈరోజు మొత్తం మీకు నచ్చినట్లు మీరు ఏడండి అన్నట్లు చేతులెత్తేశాడు. దీంతో మొదటి రౌండ్‌లో నిఖిల్ టీమ్ 66 ఎగ్స్ కలెక్ట్ చేయగా కాంతారా టీమ్ 30 ఎగ్స్ కే సరిపెట్టుకుంది.
తర్వాత మూవింగ్ ప్లాట్ ఫామ్ మీద బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు . దానిలో కాంతార టీమ్ ఎక్కువ పాయింట్లు గెలిచింది. ఇక నబీల్ తనను తాకరాని చోట తాకబోయాడంటూ ముందు చెప్పిన విష్ణుప్రియ..తర్వాత తన మాట వెనక్కి తీసుకుంది. “ఇందాక గేమ్‌లో నబీల్ టచ్ చేయలేదని.. బై మిస్టేక్ టచ్ చేస్తాడేమోనని తాను అలా అరిచానని చెప్పింది. కానీ తను అలా ఏం చేయలేదు.. ఐయామ్ సారీ నబీల్.. రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు అంటూ సారీ చెప్పేసింది విష్ణు.
మరోవైపు హౌస్‌లో బిగ్‌బాస్ కొత్త రూల్ పెట్టాడు. బిగ్‌బాస్ ఇంటి కిచెన్‌లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చిందని చెబుతాడు. ఈ రూల్ ప్రకారం కిచెన్‌లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలని.. అలాగే ఒక టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీమ్‌కి సంబంధించిన ముగ్గురు సభ్యులు మాత్రమే కిచెన్‌లో ఉండాలని చెబుతాడు. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో కూరగాయలు కోయడాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటామని బిగ్‌బాస్ చెప్పడంతో.. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ మాడిపోయాయి.
ఇక కాంతార చీఫ్ అభయ్ అయితే ఈ రూల్స్ రాసినోళ్లు మనిషి పుట్టుక పుట్టారా లేదా అంటూ ఫైరయిపోయాడు. అంతమందికి ముగ్గురు ఎలా వండుతారా ధమాక్ లేదా అంటూ కాస్త కంట్రోల్ తప్పుతాడు. అసలు ఈ రూల్స్ అన్నీ తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండటానికి పెడుతున్నారా సైకోగాళ్లు అంటూ రెచ్చిపోయాడు.