బిగ్ బాస్ సీజన్ 8లో ఈ మధ్య లవ్ ట్రాక్స్ ఎక్కువ అయిపోయాయి. మొన్నటి వరకూ సోనియా ఉన్నప్పుడు నిఖిల్, పృథ్వీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందా అన్న అనుమానాలు వినిపించేవి. సోనియా వెళ్లాక విష్ణు ప్రియ పృథ్వీ ని, యష్మీ నిఖిల్ ని ఇష్టపడటమే కాదు చాలా సార్లు ఓపెన్ అయ్యారు. అయితే వాళ్ల మధ్య ఉన్న క్లారిటీతో పృథ్వీ విష్ణు కి నో చెప్పేసాడు. కానీ నిఖిల్ మాత్రం యష్మీ కి ఎస్ చెప్పడు.. నో కూడా చెప్పడు. కాసేపు ఆమెతో ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు అంతలోనే ఇష్టం లేదన్నట్టుగా వ్యవహరిస్తాడు. దీంతో నిఖిల్ డబుల్ గేమ్స్ ఆడుతున్నాడా ఏంటన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
శుక్రవారం ఎపిసోడ్లో యష్మీ నిఖిల్ తో ..నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటుంది. అప్పుడు నిఖిల్ తన వెంట తిప్పుకుంటుంటే మజా వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతాడు. కానీ పక్క రోజు నుంచి తనకి ఇలాంటి రిలేషన్స్ వంటివి ఇష్టం ఉండవన్నట్లే ప్రవర్తిస్తాడు. అలాగే తనపై అంచనాలు పెంచుకోవద్దని నీకు చెప్పాను కదా అని యష్మీ తో నిఖిల్ అనడంతో యష్మీ ఫీల్ అవుతుంది.
తర్వాత ప్రేరణ తో మాట్లాడుతూ.. నిఖిల్ ప్రవర్తన గురించి చెప్తూ బాధపడుతుంది. మొన్న విష్ణు ప్రియకి నీ గురించి ఏమని చెప్పాడని ప్రేరణ యష్మీ ని అడగగా, యష్మీ మాట్లాడుతూ లాస్ట్ వీక్ నేను గౌతమ్ తో డ్యాన్స్ వేసాను కదా, దానికి నిఖిల్ చాలా అసూయ పడ్డాడట. నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు అసూయ పడాలని అడుగుతుంది. అంతేకాదు ఇలా చాలా ఉన్నాయి. వాడు కెమెరాల ముందు మంచోడు అవుదామని నటిస్తే నటించమను నేనైతే ఇలాగే నిజాయితీగా ఉంటానని చెప్పుకొచ్చింది.
యష్మీకి మొన్నటి వరకూ ఫోకస్ మొత్తం గేమ్ మీదనే ఉండేది. కానీ ఈ వారం మొత్తం నిఖిల్ జపం చేస్తూ అతని వెనుకే తిరుగుతూ ఉంది. యష్మీ ఏంటి ఇలా అయిపోయిందని ఆమె అభిమానులు కూడా ఫీల్ అయిపోతున్నారు. నిఖిల్ మీద ఇష్టాన్ని బయటకి వెళ్లిన తర్వాత చూసుకుంటా, హౌస్ లోకి తీసుకొచ్చి అతని గేమ్ ని, నా గేమ్ ని డిస్టర్బ్ చేసుకోనని పృథ్వీ తో అన్న యష్మీ ఇలా తయారయిందేంటా అన వాపోతున్నారు. ఇటు ఈ వీక్ మొత్తం ఆమె డిప్రెషన్ లోనే ఉండిపోయింది. ఇలాగే ఉంటూ ఒక్క గేమ్ కూడా సరిగా ఆడకపోతే.. టాప్ 5 కి వెళ్లడం కష్టమేనని అంటున్నారు.