బిగ్ బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. సోమవారం ఎపిసోడ్‌లో హౌస్లోకి కొంతమంది సెలబ్రెటీస్ వచ్చారు. మొన్న ఓంకార్ వచ్చి తమ ఇస్మార్ట్ సీజన్ 3 షో గురించి ప్రమోట్ చేసి వెళ్లగా.. ఇప్పుడు కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా హీరో హీరోయిన్స్ అర్జున్ కళ్యాణ్, అనుమిత హౌస్‌లోకి వచ్చారు. తమ సీరియల్ ప్రమోషన్స్ కోసం వచ్చిన ఈ ఇద్దరికీ గేమ్ అంటూ ట్విస్ట్ ఇచ్చి చుక్కలు చూపించాడు బిగ్ బాస్.
మా పరివారం వర్సెస్ బిగ్ బాస్ పరివారం మధ్య జరిగే టాస్కులలో గెలిచి విన్నర్ ప్రైజ్ మనీని పెంచుకోవచ్చంటూ రూల్స్ చెప్పాడు బిగ్ బాస్. ఒకరు డ్రమ్ లో పడుకొని ఉండగా.. మరొకరు దొర్లించుకుని వేరే చివరి వరకు తీసుకెళ్లాలి. అక్కడ ఉన్న వస్తువులను పట్టుకుని మళ్లీ ఇటువైపు డ్రమ్మును దొర్లించాలి. అయితే ఈ గేమ్ లో కాస్త తడబడిన అనుమిత..డ్రమ్ ఒక్కసారి దొర్లించేసరికే బయటకు వచ్చేసింది. ఈ టాస్కులో బీబీ పరివారం గెలిచి విన్నర్ ప్రైజ్ మనీకి 12000 రూపాయలు యాడ్ చేసుకుంది.
ఇక ఆ సీరియల్ టీం వెళ్లిపోయిన తర్వాత ఇంటి సభ్యులంతా దాగుడుమూతలు ఆడుకున్నారు. ఈ ఆటలో బిగ్ బాస్ అవినాష్‌తో ఓ ఆటాడుకున్నాడు. అవినాష్ బయటకు వద్దామంటే డోర్ లాక్ చేయడమే కాకుండా.. తలుపు తీయమని కెమెరాకు వేడుకున్నా కూడా లైట్స్ ఆపేసి.. వింత వింత సౌండ్స్ చేసి డోర్ ఓపెన్ చేయకుండా భయపెట్టాడు. లోపల అవినాష్ రియాక్షన్స్ అంతా టీవీలో చూసి తెగ నవ్వుకున్నారు హౌస్ మేట్స్.
ఆ తర్వాత టీవీ యాక్టర్ ప్రభాకర్, సీనియర్ నటి ఆమని హౌస్ లోకి వచ్చారు. తమ కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీ గురించి చెప్పి.. ఆ తర్వాత అందరితో మాట్లాడారు. ఈ టాపిక్‌లో నిఖిల్‌కు ప్రేమ పెళ్లి ఇష్టమా లేక అరెంజ్డ్ మ్యారేజా అని ప్రభాకర్ అడగ్గా.. లవ్ మ్యారేజ్ ఇష్టమని నిఖిల్ అంటాడు. దానికి రీజన్ ఏం లేదని.. ప్రేమ అంటే ఆ పర్సన్ తో మనం ట్రావెల్ చేస్తాం కాబట్టటి అర్థం చేసుకుంటామని నిఖిల్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదా అని మళ్లీ ప్రభాకర్ అడగగా.. ప్రేమ పెళ్లి అయినా సరే కూడా తమ ఫ్యామిలీని ఒప్పించే చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. అయితే ఎప్పటినుంచో గోరింటాకు ఫేమ్ నటి కావ్యతో నిఖిల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కాకపోతే బిగ్ బాస్ షోలోకి వచ్చే ముందే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. బిగ్ హౌస్‌లోకి వచ్చాక నిఖిల్ ప్రవర్తనపైన కూడా కావ్య పెట్టిన పోస్టులు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నిఖిల్ , కావ్యను ఒప్పిస్తాడో లేదో చూడాలి.