మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే చిన్న చిన్న కారణాలతో జరిగే పెద్ద పెద్ద గొడవలు, లవ్ స్టోరీలు, గ్రూప్ పాలిటిక్స్ అన్న ఫీల్ అందరిలో ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఇదే జరుగుతుంది. శనివారం , ఆదివారం నాగ్ ఆటపాటలు, ఎలిమినేషన్ తో హీటెక్కిన బిగ్ బాస్ మళ్లీ మండే రోజు నామినేషన్స్ తో మండిపోతూ ఉంటుంది.
బిగ్ బాస్ 8లోనూ నామినేషన్ రోజు కంటెస్టెంట్స్ తమ తోటి వారు తననెందుకు నామినేషన్ చేశారంటూ షాక్ అవుతుంటే.. ఇటు ఆడియన్స్ కూడా నామినేషన్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయన్న ఫీలింగ్ లో ఆడియన్స్ ఉన్నారు. అందుకే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ ఒక్కరోజులో ప్రసారం చేయడం చాలా కష్టంగా మారిపోతుందట బిగ్ బాస్ టీమ్ కు. అందుకే ఇకపై బిగ్ బాస్ లో నామినేషన్ టెలికాస్ట్ అయ్యేలా రెండు భాగాలుగా విభజించారు బిగ్ బాస్ మేకర్స్.
ఈసారి నామినేషన్స్ లో.. హరితేజ, ప్రేరణలో ఎవరైతే ముందు గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీ పట్టుకుంటారో వారి చేతికి.. ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. వారి ముందు ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ పేరు,నామినేషన్ చేయడానిక తమకున్న కారణాలు చెప్పగా.. ఆ ఇద్దరి నుంచి ఎవరిని నామినేట్ చేయాలో ప్రేరణ, హరితేజ డిసైడ్ చేస్తారు.
అలా ముందుగా రోహిణి వచ్చి గౌతమ్‌ను నామినేట్ చేస్తుంది. కామెడీ టాస్క్‌ను కామెడీగా తీసుకోకుండా సీరియస్‌గా తీసుకున్నాడనే రీజన్ చెప్పింది. దానికి గౌతమ్ రివర్స్ అయి..అసలు అవినాష్ చేసింది కామెడీ కాదని కావాలని ఒకరిని బాధపెట్టడం అని వాదించాడు. అంతే కాకుండా బిగ్ బాస్ అనేది కామెడీ షో కాదంటూ కామెడియన్స్‌ను తక్కువ చేసినట్టుగా మాట్లాడటం కాస్త హర్టింగ్ గా అన్పించింది.