ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా ఈ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణలో అల్లు అర్జున్ తో పాటు సినిమాకు సంబంధించిన కీలక నటీనటులు అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కాగా దర్శక దిగ్గజం రాజమౌళి పుష్ప2 సెట్ లో ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి రాకతో పుష్ప 2 యూనిట్ సభ్యులు అంతా సర్‌ప్రైజ్ అయ్యారని తెలుస్తోంది. సుకుమార్ తో ఉన్న అనుబంధం తో జక్కన్న పుష్ప రాజ్ సెట్ కి వెళ్లారు.
పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఒక సన్నివేశం చిత్రీకరణ ను రాజమౌళి అక్కడే ఉండి శ్రద్దగా గమనించినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సుకుమార్ సీన్ క్రియేషన్ ను రాజమౌళి చూసి చాలా బాగా తీశారంటూ అక్కడికి అక్కడే అభినందించారట. సుకుమార్ మేకింగ్ స్టైల్ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే ఆయన ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నారట. దాదాపు 30 నిమిషాల పాటు రాజమౌళి అక్కడే ఉన్నారని, చిత్ర యూనిట్ సభ్యుల్లో కీలక వ్యక్తులను రాజమౌళికి సుకుమార్ పరిచయం చేశారని తెలుస్తోంది. పుష్ప 2 కి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు సుకుమార్ తో రాజమౌళి చర్చించారట. ఒక షాట్ ను సుకుమార్ చిత్రీకరించిన విధానంకు రాజమౌళి ఫిదా అయ్యి అద్భుతం అంటూ అభినందించారట.
భారతీయ సినిమాకు గర్వకారణమైన డైరెక్టర్ రాజమౌళి దేశంలోనే అతిపెద్ద మాస్ సినిమా సెట్స్ ను సందర్శించారని పుష్ప టీమ్ ఎక్స్లో ఫొటోను పోస్ట్ చేసింది. పుష్ప 2 సినిమా సెట్ లో రాజమౌళి చేసిన సందడి తాలూకు వీడియో ను సినిమా విడుదల సమయంలో లేదా ముందే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇలాంటి కలయికలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందుకే పుష్ప 2 సెట్ లో రాజమౌళి అనే వార్తలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి.
ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.