బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ ని రాయల్ క్లాన్ గా.. ఆల్రెడీ హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ ని ఓజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐతే ప్రతి టాస్క్ ని రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ అన్నట్టుగా టాస్కులు ఇస్తున్న బిగ్ బాస్.. ఈ రెండు గ్రూపుల మధ్య సాధ్యమైనంత వరకు గొడవలు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా అని ఆడియన్స్ సందేహపడుతున్నారు. రాయల్ క్లాన్ లో అందరూ కూడా టాస్కుల్లో బాగానే క్లాన్ వైజ్ ఆడుతున్నా కొందరు మాత్రం పేరుకే గ్రూప్ తమ ఆట తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ముఖ్యగా రాయల్ క్లాన్స్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఆల్రెడీ బయట నుంచి బిగ్ బాస్ హౌస్ ఐదు వారాల ఆట చూసి వచ్చిన వీరంతా.. ఎందుకు కొందరిని కావాలని టార్గెట్ చేస్తున్నారనే డౌట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ క్లాన్ సభ్యుల్లో కొంతమంది సేఫ్ గేం ఆడుతూ మంచి వారనిపించుకోవాలని తెగ చూస్తున్నారన్న విమర్శలున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 8 లో రెండు క్లాన్స్ మధ్య ఫైట్ జరుగుతూ వస్తుంది. ప్రతి టాస్క్ కూడా వారి మధ్యే జరుగుతుంది. ఐతే రాయల్ క్లాన్ వచ్చాక జరిగిన నామినేషన్స్ అంతా కూడా రాయల్ క్లాన్ వారంతా మాక్సిమం ఓజీ క్లాన్ వారికే నామినేషన్లు వేస్తున్నారు తప్ప సొంత రాయల్ క్లాన్ సభ్యులకు వేయట్లేదు.
ఒక్క ఈ వారం మాత్రమే హరితేజ, నబీల్ మెహబూబ్ కి వేశారని తిరిగి మెహబూబ్ కూడా రాయల్ క్లాన్ మెంబర్స్ అయిన హరితేజ, నయని పావనిలకు నామినేష్లు వేశాడు . అంతే తప్ప కింద రెండు వారాలు మాత్రం సొంత క్లాన్ సభ్యులు ఎవరూ కూడా వారిని వారు నామినేట్ చేసుకోలేదు.
వైల్డ్ కార్డ్ గా వచ్చిన రాయల్స్ అంతా..వారు మాత్రమే హౌస్ లో ఉండి ఆ ఓజీ క్లాన్ మెంబర్స్ అందరినీ ఇంటికి పంపించాలన్న ప్లానింగ్ లో వచ్చారా అన్న అనుమానాలు తలెత్తేలా చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో రాయల్ క్లాన్ నుంచి హరితేజ ఉన్నా కూడా.. కానీ మెగా చీఫ్ అయిన గౌతం ఆమెకు నామినేషన్ షీల్డ్ ఇచ్చి హరితేజను సేవ్ చేశాడు. మొత్తానికి హౌస్ లో రాయల్ క్లాన్ సెపరేట్ గేమ్ ప్లాన్ తోనే ఆట ఆడుతుందని అర్ధమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.