క్యూ కడుతున్న మద్యం ప్రియులు.. ఏపీలో మద్యం బాటిల్స్‌తో కళకళలాడుతున్న దుకాణాలు

Shops Bustling With Liquor Bottles In AP, Liquor Bottles In AP, Liquor Bottles, AP Liquor Policy 2024, BJP, Branded Liquor, Jana Sena, Liquor Lovers Queuing, Shops Bustling With Liquor Bottles In AP, AP Liquor Shops, AP Liquor Shops News, Liquor Shops Tenders, AP Liquor Shop Tenders, Liquor Shop, Liquor Tenders, Branded Liquor, Jana Sena, Liquor, TDP, YCP, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఏపీలో బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చేసింది. దీంతో మద్యం బాటిళ్లతో షాపులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే.. మందు బాబులకు కొత్త మద్యం షాపులతో పాటే రెండు కిక్కిచ్చే వార్తలును ఏపీ ప్రభుత్వం చెప్పడంతో.. మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు.

మొదటి రోజు నుంచే మద్యం షాపులు కిక్కిరిసిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తూ.. ఏవేవో కొత్త కొత్త బ్రాండ్లను విక్రయించింది. భారీగా ధరలు పెంచి.. గతంలో ఎప్పుడూ వినిపించని బ్రాండ్లను ఇష్టానుసారంగా విక్రయించింది. దాంతో చాలా మంది మద్యంప్రియులు వాటిని కొనుగోలు చేయలేక ఆగిపోయారు. అయితే.. కూటమి ప్రభుత్వం మాత్రం 2019కి ముందు ఉన్న బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఆల్కహాల్ లవర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్‌సూన్ హౌజ్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి.

గత ప్రభుత్వం మద్యం బ్రాండ్లకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు..మద్యం రేట్లను కూడా బాగా తగ్గించింది. రూ.99లకే మద్యాన్ని విక్రయిస్తోంది. అలాగే అన్ని బ్రాండ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు తగ్గినట్లు ఆల్కహాల్ లవర్స్ చెబుతున్నారు. మరోవైపు.. ఎక్సైజ్ శాఖ మద్యం ధరలు తగ్గించామని చెబుతున్నప్పటికీ.. షాపుల్లో మాత్రం పాత ధరలకే అమ్ముతున్నారని మరికొంతమంది మద్యం ప్రియులు అంటున్నారు.