నిఖిల్‌ను వెనక్కు నెట్టేసిన ప్రేరణ.. టైటిల్ కొట్టేయడం పక్కా..

The Motivation Behind Nikhil, Nikhil Motivation, Bigg Boss 8 Telugu, Gangavva, Gautham, Hariteja, Manikantha, Nabeel, Nikhil, Nooka Avinash, Prerna, Prithvi, Rohini, Tasty Tej, Vishnupriya, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో విన్నర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడల్లా నిఖిల్ పేరే వినిపించింది. సోనియా ఉన్నప్పుడు కాస్త అటూ ఇటూ అయినా..ఆటతో పాటు ఫిజికల్ అండ్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ గా చాలామంది నిఖిల్ ను ఇష్టపడుతున్నారు. నిజమే
నాలుగైదు సార్లు మెగా చీఫ్‌ అవడం అంటే అంత ఈజీ కాదు. కండబలం, బుద్ధి బలం రెండూ ఉండటంతో టాస్కులు వస్తే చెలరేగిపోతాడు.

నిఖిల్ తనంతట తానుగా ఏ గొడవలో కూడా దూరడు. అందుకే ప్రతి వారం కూడా ఓటింగ్‌లో నిఖిల్‌ టాప్‌ ప్లేస్‌లోనే ఉంటాడు. కానీ ఈ వారం కాస్త ఈ లెక్కలు మారాయి. నిఖిల్‌ను వెనక్కు నెట్టి ప్రేరణ టాప్ ప్లేసులోకి వచ్చేసింది. నామినేషన్స్‌లో ఉన్నవారికంటే ప్రేరణకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆటలో శివంగిలా పోరాడుతూ.. ఎవరి సపోర్ట్‌ లేకపోయినా సింగిల్‌గా ఫైట్‌ చేస్తున్న ప్రేరణకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య పృథ్వీ ఆమెను టార్గెట్‌ చేయడంతో తనపై సింపతీ కూడా పెరిగిపోతుంది.

గత సీజన్‌ హౌస్‌ మేట్స్ అంతా కలిసి పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్‌ చేశారు. కట్‌ చేస్తే అతడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో ఇంటి సభ్యులంతా మణికంఠకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దీంతో ప్రతివారం నామినేషన్‌లో ఉన్నా సరే ఆడియన్స్ మాత్రం సేవ్‌ చేస్తూ వచ్చారు. కానీ తనే ఒత్తిడి తట్టుకోలేక తనంతట తానే ఎలిమినేట్‌ అయ్యాడు మణికంఠ.

లాస్ట్ వీక్ నామినేషన్స్‌ డిసైడ్‌ చేసే పవర్స్‌ హరితేజ, ప్రేరణకు వచ్చింది. అప్పుడు పృథ్వీ, నయని ప్రేరణను ఆడనివ్వకుండా అడ్డుపడ్డారు. అప్పుడామె కన్నీళ్లు పెట్టుకుంటే హౌస్‌ సభ్యులెవరూ ప్రేరణను కనీసం ఓదార్చలేదు, సపోర్ట్‌ కూడా చేయలేదు. చివరకు యష్మి సపోర్ట్‌గా నిలబడినా కూడా అది హార్ట్ ఫుల్ గా లేదన్న విషయం అందరికీ అర్ధం అయిపోయింది. ఆడియన్స్ లో పెరిగిన ఈ సింపతీ కూడా ప్రేరణకు ప్లస్ అయింది. ప్రేరణ తర్వాత వారాల్లోనూ ఓటింగ్‌లో ఇదే దూకుడు చూపిస్తే బిగ్‌బాస్‌ విన్నర్‌ కావడం గ్యారంటీ అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.