బిగ్ బాస్ ఓటింగ్‌కు ఈరోజే ఆఖరు రోజు.. టైటిల్ విన్నర్‌కు కౌంట్ డౌన్ షురూ..

Today Is The Last Day For Bigg Boss Voting, Bigg Boss Voting, Last Day For Bigg Boss Voting, Bigg Boss Voting Today Is The Last Day, Avinash, Bigg Boss House, Bigg Boss Voting, Gautham Krishna, Nabeel, Nikhil, Prerna, Bigg Boss Grand Finale, Bigg Boss Finale, Grand Finale, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ 8 విన్నర్‌ను డిసైడ్ చేయడానికి వేయాల్సిన ఓటింగ్ ఈరోజుతో ముగియనుంది. అంటే డిసెంబర్ 13 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఓటింగ్ పోల్స్ ఓపెన్‌గా ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న టాప్ 5 ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. దీనిలో భాగంగానే డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ, జబర్దస్త్ అవినాష్ ఏవీలను చూపించారు.

గౌతమ్‌కు ఒక రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ అరగంటపాటు అతని బిగ్ బాస్ జర్నీని చూపించారు. తర్వాత అవినాష్ బిగ్ బాస్ జర్నీని చూపించారు. అవినాష్ కేవలం కమెడియన్ మాత్రమే కాదని అన్నింట్లో ముందున్న ఎంటర్‌టైనర్ అంటూ బిగ్ బాస్ అతడిని పొగిడాడు.ఇక డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో ప్రేరణ, నబీల్ జర్నీ వీడియోలను ప్రసారం చేయనున్నారు.

కాగా..డిసెంబర్ 15న బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బిగ్ బాస్ 8 తెలుగు ఇన్ఫినిటీ ఫినాలే పేరుతో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి టైటిల్ విజేతను ఎనౌన్స్ చేయనున్నారు. బిగ్ బాస్ విన్నర్‌ను గెలిపించుకోవడానికి వేయాల్సిన ఓటింగ్ పోల్స్ ఈరోజు ముగియనున్నాయి. అలాగే, తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కు ఇప్పటి వరకూ కేటాయించిన ఫోన్ నెంబర్స్‌కి కాల్ చేసి ఓట్ వేయడానికి కూడా ఇదే చివరి రోజు.

ఇక ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 2 స్థానాలు తరచుగా మారుతున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు టాప్ 1 స్థానంలో గౌతమ్ నిలిచాడు. 34 శాతం ఓటింగ్.. 63,806 ఓట్లతో టాప్ 1 స్థానంలో ఉన్నాడు. తర్వాత అదే 34 శాతం ఓటింగ్‌తో టాప్ 2 లో నిఖిల్ ఉన్నాడు. అయితే, నిఖిల్‌కు 63,370 ఓట్లు పడ్డాయి. ఇద్దరికి ఓట్ల మధ్య కొద్ది తేడా మాత్రమే వస్తుంది.

ఇక మూడో స్థానంలో నబీల్ ఉండగా ఆ తర్వాత ప్రేరణ ఉండగా..ఇక మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన ఈ సీజన్‌కు విజేతగా గౌతమ్ లేదా నిఖిల్‌లో ఒక్కరు నిలవనున్నారు. అయితే విన్నర్ ఎవరనేది తెలియాలంటే మాత్రం గ్రాండ్ ఫినాలే వరకు ఆగాల్సిందే.