ముగిసిన ఓటింగ్..టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా?

Will There Be An Elimination This Week

బిగ్ బాస్ 8వ సీజన్ ఈ వారానికి సంబంధించిన ఓటింగ్ శుక్రవారం అర్థ రాత్రి 12 గంటలకు ముగిసింది. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, నైనికా , ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లేందుకు ఓజీ క్లాన్ నుంచి విష్ణు ప్రియ, యష్మీ, సీత ,పృథ్వీ నామినేట్ అవ్వగా, రాయల్ క్లాన్ నుంచి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యారు.

ఈ వారం యష్మీకి పడిన ఓటింగ్ ని చూసి ఆడియన్స్ కంగుతినే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే.. యష్మీని బాగా అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. టాస్క్ వచ్చినప్పుడు నూటికి నూరు శాతం తన వైపు నుంచి బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ముందు ఒక మాట, వెనుక ఒక మాట కాకుండా ఎవరి దగ్గర అయినా ఒకే అభిప్రాయంతో ఉండడం యష్మీకి ప్లస్ అయినట్లుల తెలుస్తోంది. ఎలాంటి మాస్క్ లేకుండా తనలోని భావాలను బయటపెట్టడం ఆడియన్స్ కు బాగా నచ్చినట్లే ఉంది. అందుకే యష్మీకి భారీగా ఓట్లు గుద్దేశారు.

ఇక ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే.. ఆమె విష్ణు ప్రియని కూడా వెనక్కి నెట్టి టాప్ 3 స్థానంలో యష్మీ నిల్చింది. అలాగే మొదటి స్థానం లో గంగవ్వ అందరికంటే టాప్‌లో కొనసాగుతుండగా, రెండో స్థానంలో మెహబూబ్ నిలిచాడు. ఇక విష్ణు ప్రియ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ప్రారంభంలో రెండో స్థానంలో ఉన్నా..ఇప్పుడు మాత్రం ఇప్పుడు నాల్గవ స్థానానికి పడిపోయింది.

ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్వీ, సీత ఉన్నారు. అయితే పృథ్వీకి, సీతకి మధ్య చాలా ఓట్ల మార్జిన్ ఉండటంతో.. ఈ వారం సీత ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మొదటి రెండు వారాల్లో మాత్రం సీత గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో ఉండేది. కానీ నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా సీత మాత్రం టాప్ 3 స్థానాల్లో ఎదొక స్థానంలో ఉండేది. కానీ ఈమధ్యన ఆమెలో గేమ్ స్పిరిట్ తగ్గిపోయి, చాలా నెగటివ్ యాంగిల్స్ బయటపడుతున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే ఓటింగ్ భారీగా స్థాయిలో పడిపోవడంతో..సీత డేంజర్ జోన్‌లో పడింది. అయితే ఈరోజు దసరా కాబట్టి ఎలిమినేషన్ ఉండదన్న వార్తలు వినిపిస్తున్నాయి.