కరోనావైరస్ సోకి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ జూన్ 10, బుధవారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. జూన్ 10 ఆయన పుట్టిన రోజు కాగా, పుట్టిన రోజే నాడే కరోనా వలన ఆయన తుది శ్వాస విడిచారు. అన్బళగన్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో చెపాక్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2001, 2011 మరియు 2016 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అన్బళగన్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. దేశంలో కరోనా సోకి ఓ ఎమ్మెల్యే మృతి చెందడం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే అన్బళగన్ మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలు పార్టీల రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Home జాతీయం/అంతర్జాతీయం